Latest News

కొడకా అంటూ ఈటల హెచ్చరించింది ఎవర్ని? కేటీఆర్ ఫోన్ చేశాకే ఈటల వివరణ ఇచ్చారా?

posted on: Aug 30, 2019 2:32PM

 

కొడకా గుర్తుపెట్టుకో... మేం గులాబీ జెండా ఓనర్లం... మధ్యలో వచ్చినోళ్లం కాదు... అడుక్కొచ్చినోళ్లం అసలే కాదు... నాకు మంత్రి పదవి ఎవరో వేసిన భిక్ష కాదు... నేతలు, వ్యక్తులు చరిత్ర నిర్మాతలు కారు... ప్రజలే చరిత్ర నిర్మాతలు... నాకు నేనై వచ్చిన... నేనై నిలబడగా... నన్ను ఓడించాలని కుట్ర చేశారు... కానీ నేను నిరంతరం వెలిగే దీపాన్ని... అధికారం శాశ్వతం కాదు... ధర్మం న్యాయం మాత్రమే శాశ్వతం... ధర్మం న్యాయం నుంచి ఎవరూ తప్పించుకోలేరు... ఏదోఒక రోజు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు... హీరో ఎవరో... జీరో ఎవరో త్వరలోనే తేలుతుంది... ఇవీ ఈటల రాజేందర్ నోటి నుంచి పేలిన మాటల తూటాలు

ఈటల మాటల్ని పరిశీలిస్తే, ఎవరిని టార్గెట్ చేశారో ఇట్టే అర్ధమవుతుంది. అధిష్టానాన్నే లక్ష్యంగా చేసుకుని నిప్పులు కక్కినట్లే కనిపిస్తోంది. మంత్రి పదవి ఎవరి భిక్షా కాదు... గులాబీ జెండాకు మేము కూడా ఓనర్లమే... అంటూ ఈటల చేసిన వ్యాఖ్యలు... కేసీఆర్ అండ్ కేటీఆర్ ఆధిపత్యాన్ని ప్రశ్నించినట్లు అగుపిస్తోంది. ఈటల చేసిన ఈ కామెంట్స్... ఏదో యధాలాపంగా సాధారణంగా చేసినట్లుగా కూడా లేవు. మంత్రి పదవి నాకు భిక్ష కాదు అని ఈటల అన్నారంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఆషామాషీ ప్రకటన కాదు. ఇక, నాయకులు చరిత్ర నిర్మాతలు కానే కాదని... ప్రజలే చరిత్ర నిర్మాతలని అన్నారంటే... తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఘనత ప్రజలదేనని చెప్పకనే చెప్పారు.

ఈటల మాటలు... టీఆర్ఎస్ అధిష్టానంపైనా, కేసీఆర్ కుటుంబ ఏకపక్ష పోకడలపైనా తిరుగుబాటుగానే కనిపిస్తున్నాయి. అందుకే, ఈటల మాటలు తూటాల్లా గుచ్చుకోవడంతో... టీఆర్ఎస్ అధిష్టానం రంగంలోకి దిగింది. కేటీఆరే స్వయంగా ఈటలతో ఫోన్ లో మాట్లాడరనే మాట వినిపిస్తోంది. ఆ తర్వాతే ఈటల వివరణ ప్రకటన ఇచ్చారని అంటున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...