ముఖ్యమంత్రి బినామీ కంపెనీకి రూ.6 వేల కోట్ల పనులు : కేటీఆర్

posted on: Feb 4, 2026 3:04PM

 

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  KLSR ఇన్ఫ్రా టెక్ అనే కంపెనీ ముఖ్యమంత్రి బినామీ కంపెనీ అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి వాడుతున్న కారు కూడా ఈ సంస్థ పేరు మీదే ఉందని అని కేటీఆర్ అన్నారు. 2018లోనే ఈ కంపెనీ ఐటీ దాడులు జరిగాయిని..2023లో దివాళా తీసింది. వాళ్ల దగ్గర సిబ్బందికి జీతాలు ఇచ్చేందుకూ డబ్బులు లేవు. అలాంటి కంపెనీకి రూ.6వేల కోట్ల కాంట్రాక్టులు ఎలా ఇచ్చారని మాజీ మంత్రి ప్రశ్నించారు. 

సుప్రీంకోర్టు స్వయంగా సీబీఐ, ఈడీ లేదా ఎస్.ఎఫ్.ఐ.ఓ ద్వారా స్వతంత్ర విచారణ జరిపించాలని కోరారు. ఈ బినామీ భాగోతాన్ని దాచడానికే ముఖ్యమంత్రి దావోస్ నుంచి ఆదేశాలు ఇచ్చి విచారణల పేరుతో డ్రామా నడిపించారని ఆరోపించారు. న్యాయవ్యవస్థ ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ వేల కోట్ల కొత్త కాంట్రాక్టులు ఎలా ఇచ్చారో రేవంత్‌రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకుంటున్న నిర్ణయాలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను వరుసగా కొట్టివేయడం రాజ్యాంగానికి గొడ్డలిపెట్టు అని, ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆయన తీవ్రంగా ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే స్పీకర్ నడుచుకుంటున్నారని, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌పై అనర్హత పిటిషన్‌ను స్పీకర్ కొట్టివేయడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. 
 

google-ad-img
    Related Sigment News
    • Loading...