Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏసీబీ నోటీసులతో రేవంత్‌పై కేటీఆర్ సెటైర్లు
posted on: Jun 13, 2025 7:06PM

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్, కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 16న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసులులో పేర్కొంది. ఫార్ములా- ఈరేసు కేసులో విచారణకు హాజరుకావాలని తెలిపింది. మే 26నే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చింది. విదేశీ పర్యటన షెడ్యూల్ ఉందని.. తిరిగి వచ్చాక హాజరవుతానని కేటీఆర్ సమాధానం ఇచ్చారు. తాజాగా ఇప్పుడు విచారణకు హాజరు కావాలని కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులపై కేటీఆర్ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు విచారణకు సహకరిస్తానంటూనే సీఎం రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేశారు. బాధ్యత గల పౌరుడిగా విచారణకు హాజరవుతానన్న కేటీఆర్, పాలన చేతగాక ప్రజల దృష్టి మళ్లించే యత్నం చేస్తున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు.
ఓటుకు నోటు కేసులో సీఎంను కూడా ఏసీబీ విచారిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నా. ఇద్దరం ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్నాం. లై డిటెక్టర్ పరీక్షలకు నేను సిద్ధం.. మీరు సిద్ధమా..? జడ్జి సమక్షంలో ఇద్దరం లై డిటెక్టర్ పరీక్షలు చేయించుకుందాం. ఈ పరీక్షలను టీవీల్లో లైవ్‌గా చూపిద్దాం. లై డిటెక్టర్ పరీక్షలు చూసి ఎవరు నేరస్థులో ప్రజలే నిర్ణయిస్తారు. నాతో పాటు లై డిటెక్టర్ పరీక్షలు చేయించుకునే ధైర్యం ఉందా..? రాష్ట్రం దివాళా తీసిందంటూనే పదేపదే విచారణలతో ప్రజాధనం వృథా ఎందుకు..? ప్రజాధనం వృథా ఎందుకు..? అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ నిలదీశారు. కేటీఆర్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలోవైరల్ అవుతోంది.
లై డిటెక్టర్ పరీక్షలకు నేను సిద్ధం.. సీఎం సిద్ధమా?
ఏసీబీ నోటీసులపై కేటీఆర్ స్పందించారు. ఫార్ములా-ఈ కేసులో ఈనెల 16న ఏసీబీ విచారణకు సహకరిస్తానని తెలిపారు. ‘‘బాధ్యత గల పౌరుడిగా విచారణకు హాజరవుతా. పాలన చేతకాక ప్రజల దృష్టి మళ్లించే యత్నం ఇది. ఓటుకు నోటు కేసులో సీఎంను కూడా ఏసీబీ విచారిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసురుతున్నా. ఇద్దరం ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్నాం. లై డిటెక్టర్ పరీక్షలకు నేను సిద్ధం.. మీరు సిద్ధమా? జడ్జి సమక్షంలో ఇద్దరం లై డిటెక్టర్ పరీక్షలు చేయించుకుందాం. టీవీల్లో లైవ్‌గా చూపిద్దాం. లైడిటెక్టర్ పరీక్షలు చూసి ఎవరు నేరస్థులో ప్రజలే నిర్ణయిస్తారు. నాతో పాటు లై డిటెక్టర్ పరీక్షలు చేయించుకునే ధైర్యం ఉందా? పదే పదే విచారణలతో ప్రజాధనం వృథా ఎందుకు?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు.



.webp)


