Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సాక్ష్యాలు చెరిపేందుకే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు మంటలు : కేటీఆర్
posted on: Feb 7, 2026 2:45PM

ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కీలక సాక్ష్యాలను రూపుమాపేందుకే ఈ కుట్ర అని బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ఎక్స్‌లో పోస్ట్ చేయగా, దీనిపై కేటీఆర్ స్పందించారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన వాయిస్ రికార్డింగ్‌లను, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలను మాయం చేసేందుకే ఇలా చేస్తున్నారు. అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
మరోవైపు నాంపల్లి ఫోరెన్సిక్ ఫైర్ యాక్సిడెంట్‌పై అధికారుల ప్రకటనలు గందరగోళానికి దారితీస్తున్నాయి. సాక్ష్యాలు, హార్డ్ డిస్క్‌లు పూర్తిగా బూడిదయ్యాయని ఫైర్ ఆఫీసర్ శ్రీధర్ ధృవీకరించగా సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి మాత్రం ఏ ఫైల్స్ తగలబడ్డాయో ఇంకా స్పష్టత లేదని తెలిపారు. కీలకమైన సాక్ష్యాధారాల విషయంలో ఇలాంటి విరుద్దమైన స్టేట్‌మెంట్లు రావడం ప్రభుత్వ వైఫల్యమా లేక వ్యవస్థీకృత కుట్రనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి


.webp)



