కృష్ణా జడ్పీ మహిళల పరం
posted on Mar 11, 2014 7:51AM
.jpg)
కృష్ణా జిల్లా పరిషత్ పీఠంపై మరోసారి మహిళ కాలు మోపనుంది. ఇప్పటివరకు జరిగిన జడ్పీ ఎన్నికల్లో ఒక్కసారి మాత్రమే మహిళకు అవకాశం దక్కింది. ఇప్పుడు మరోసారి మహిళ ఆ పీఠాన్ని అధిష్టించనుంది. కృజిల్లాలో 49 మండలాలు ఉండగా 21 స్థానాలు జనరల్‌కు, 13 బీసీలకు, 13 ఎస్సీలకు, రెండు ఎస్టీలకు కేటాయించారు. కృష్ణాజిల్లా పరిషత్ 1960లో ఏర్పడగా, 1962లో చల్లపల్లి రాజా యార్లగడ్డ శివరామప్రసాద్ జడ్పీ చైర్మన్‌గా పనిచేశారు. 1964 సెప్టెంబర్ 11న జిల్లా పరిషత్ చైర్మన్‌గా పిన్నమనేని కోటేశ్వరరావు ఎంపికై 1976 జనవరి 19 వరకు ఆ పదవిలో కొనసాగారు. 1987 నుంచి జడ్పీ చైర్మన్‌ను నేరుగా ఎన్నుకునే పద్ధతి ప్రారంభమైంది. దాదాపు 19 సంవత్సరాల పాటు పిన్నమనేని చైర్మన్‌గా పనిచేశారు. 1995లో కడియాల రాఘవరావు, 2000లో ఎస్సీ మహిళలకు కేటాయించడంతో నల్లగట్ల సుధారాణి జడ్పీ చైర్మన్‌గా విధులు నిర్వర్తించారు. తర్వాత బీసీలకు వెళ్లడంతో కుక్కల నాగేశ్వరరావు చైర్మన్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు జనరల్ మహిళలకు ఆ సీటు వెళ్లింది.