శ్రీశైలంలో కోటి దీపోత్సవం
posted on Nov 15, 2025 8:35AM

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో మొట్టమొదటిసారిగా కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ అధికారులు ఆలయ ప్రధాన మాడవీధి నుండి నంది మండపం వరకు నిర్వహించిన కార్యక్రమంలో ఆలయం ముందు 45 అడుగుల భారీ కైలాసం సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సాయంత్రం 6.30 గంటలకు కైలాస వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం, దశవిధ హారతులను సమర్పించారు. గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు భక్తులు పెద్ద ఎత్తున కార్తీక దీపాలు వెలిగించారు. భక్తులకు ప్రమిదలు, పూజా సామాగ్రిని దేవస్థాన అధికారులు ఉచితంగా అందజేశారు. భక్తులు భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని కార్తీక దీపాలను వెలిగించారు. అధ్యంతం ఆధ్యాత్మిక భావనతో సాగిన కార్యక్రమం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. శ్రీశైలం క్షేగ్రంలో కోటి దీపోత్సవ కార్యక్రమం జరగడం ఇదే తొలిసారి.