Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...గొడ్డలి పార్టీ పీ4 దందా ... వైరల్ అవుతున్న పట్టాభి వ్యాఖ్యలు
posted on: May 29, 2026 4:45PM

టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ సహా ఆ పార్టీ నేతలు వైసీపీని గొడ్డలి పార్టీ అని టార్గెట్ చేస్తున్నారు. ఆ క్రమంలో గొడ్డలి పార్టీ పీ4 స్ట్రాటజీతో భారీ దోపిడీకి పాల్పడిందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె.పట్టాభిరామ్ తాజాగా విమర్శించారు. అవే.. పవర్, ప్రాపర్టీ, పైసా, పార్ట్‌నర్షిప్‌లని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని జేబులు నింపుకోవడమే గొడ్డలి పార్టీ పీ4 లక్ష్యమని ఆయన ఎద్దేవా చేశారు. లిక్కర్ స్కామ్‌లో వైసీపీ నేతలు కోట్ల రూపాయిలు దోచుకున్నారని ఈ స్కామ్‌లో వేళ్లన్నీ తాడేపల్లి పెత్తందారుల వైపే చూపిస్తున్నాయని మండిపడ్డారు.
శుక్రవారం రాజధాని అమరావతిలో కె.పట్టాభిరామ్ మాట్లాడుతూ.. 2019-24 మధ్య వైఎస్ జగన్ పీఏ కె.నాగేశ్వర్ రెడ్డి (కేఎన్ఆర్) భార్య ఖాతాలోకి రూ.20 కోట్లు వచ్చాయని ఆరోపించారు. ఓ సాధారణ పీఏ కేఎన్ఆర్ ఖాతాలోకి అన్ని కోట్లు ఎలా వచ్చాయి? అని పట్టాభిరామ్ ప్రశ్నించారు. అలాగే బెంగళూరుతో సహా పలు ప్రాంతాల్లో అతడికి ప్లాట్లు ఎలా వచ్చాయని సందేహం వ్యక్తం చేశారు. జగన్ పీఏకు మూడు రాష్ట్రాల్లో ఆస్తులున్నాయని పట్టాభిరామ్ తెలిపారు.
ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ వ్యవహారంలో జగన్ పీఏ కేఎన్ఆర్‌ను సిట్ అధికారులు ప్రశ్నించారు.
సిట్ కార్యాలయంలో గురువారం ఉదయం 11.00 గంటలకు ప్రారంభమైన ఈ విచారణ రాత్రి వరకు కొనసాగింది. బుధవారం కూడా కేఎన్‌ఆర్‌ను సిట్ అధికారులు విచారించారు. ఈ సందర్భంగా సిట్ అధికారులకు కేఎన్ఆర్ పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. 2019కి ముందు కేఎన్ఆర్ సాధారణ జీవితాన్ని గడిపారు. అయితే 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం హయాంలో అతడు వందల కోట్ల రూపాయిలకు అధిపతిగా మారినట్లు సిట్ గుర్తించింది. ఈ సందర్భంగా అతడి ఆస్తుల వివరాలతోపాటు కాల్‌డేటా ఆధారంగా సిట్ అధికారులు విచారణ చేపట్టారు.






