కోమటిరెడ్డి కొంప కొల్లేరవుతుందా?
posted on Apr 10, 2014 5:02PM

సీమాంధ్రులను నోటికొచ్చినట్టు తిట్టే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొంప కొల్లేరయ్యే పరిస్థితి ఇప్పుడొచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి నల్లగొండ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న కోమటిరెడ్డి తాను ఎన్నికల సంఘానికి సమర్పించిన నామినేషన్ పత్రాల్లో తాను హైదరాబాద్‌లో బీటెక్ చదివినట్టు రాశాడట.
అసలు విషయమేంటంటే హైదరాబాద్‌లో బీటెక్ చదవడానికి చేరిన అయ్యగారికి అంత సీన్ లేక మధ్యలోనే చదువు మానేసి ఎవరైనా రాణించగలిగే రాజకీయ రంగానికి షిష్టయ్యారట. చదువు పూర్తి చేయకుండానే బిల్డప్పు కోసం చదివేసినట్టు నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న విషయాన్ని అక్కడి టీఆర్ఎస్, స్వతంత్ర అభ్యర్థులు కనిపెట్టేశారు.
వెంకట్‌రెడ్డికి అంత సీన్ లేదని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఎన్నికల సంఘానికి చూపించారు. దాంతో కోమటిరెడ్డి ఇరకాటంలో పడ్డాడు. ఎన్నికల సంఘం తప్పుడు సమాచారం ఇచ్చావంటూ కోమటిరెడ్డి నామినేషన్ తిరస్కరిస్తే ఇక ఐదేళ్ళపాటు సారుగారు ఈగలు తోలుకుంటూ ఇంట్లో కూర్చోవాల్సిందే.