ముంబై ఇండియన్స్ పై కోల్ కతా నైట్ రైడర్స్ విజయం.. ప్లేఆఫ్ ఆశలు సజీవం

posted on: May 21, 2026 9:07AM

ముంబై ఇండియన్స్ పై విజయం సాధించి కోల్ కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 2026లో తన ప్లేఆఫ్  ఆశలను సజీవంగా నిలబెట్టుకుంది. బుధవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో  వేదికగా జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్‌పై 4 వికెట్ల తేడాతో  విజయం సాధించింది. బ్యాటింగ్ కు అంత ఈజీగా లేని పిచ్ పై తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ను 147 పరుగులకు కట్టడి చేసిన కోల్ కతా నైట్ రైడర్స్.. 148 పరుగుల విజయలక్ష్యాన్ని చెమటోడ్చి ఛేదించింది.  మనీశ్ పాండే  45 పరుగులు, రోవ్‌మన్ పావెల్  40 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.  లక్ష్య ఛేదనలో కేకేఆర్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ఫిన్ అలెన్ తొలి ఓవర్‌లోనే ఔటయ్యాడు.

ఆ తర్వాత అజింక్య రహానే (21) దూకుడుగా ఆడినా, పవర్‌ప్లే చివరి ఓవర్‌లో కార్బిన్ బాష్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. కామెరాన్ గ్రీన్  కూడా విఫలం కావడంతో  54 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కేకేఆర్ కష్టాల్లో పడింది. ఈ దశలో మనీశ్ పాండే  రోవ్‌మన్ పావెల్  జట్టును ఆదుకున్నారు. . వీరిద్దరూ  ఔటైన తరువాత మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. అయితే రింకూ సింగ్  బాధ్యతాయుతంగా ఆడి  జట్టుకు విజయాన్ని అందించాడు. 

అంతకుముందు ముంబై ఇండియన్స్‌ను  కామెరాన్ గ్రీన్, సౌరభ్ దూబే ఆరంభంలోనే వికెట్లు పడగొట్టి ముంబైని దెబ్బతీశారు.  వర్షం కారణంగా కాసేపు ఆగిన ఆట తిరిగి ప్రారంభమయ్యాక, స్పిన్నర్లు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి పరుగులను నియంత్రించారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...