ఫ్లై ఓవర్‌ కూలిపోవడం... దైవ సంకల్పం

posted on: Apr 1, 2016 11:54AM

 

 

కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ కూలిపోయి 20 మందికి పైగా మృతి చెందారనీ, 100మందికి పైగా గాయపడ్డారనీ వార్తలు వస్తున్నాయి. ఫ్లైఓవర్‌ నిర్మాణంలో లోపాల వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిపుణులు అనుమానిస్తున్నారు. అసలు ప్రమాదం జరిగే ముందురోజు రాత్రి నుంచే అది తెగ ఊగిసలాడుతోందని స్థానికుల ఆరోపిస్తున్నారు. కానీ ఈ నిర్మాణాన్ని చేప్పటిన IVRCL వాదన మాత్రం వేరేలా ఉంది. హైదరాబాదుకి చెందిన ఈ నిర్మాణ సంస్థ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ ‘కంపెనీ చరిత్రలో ఇలాంటి ప్రమాదం ఎన్నడూ జరగలేదని, బహుశా దైవ సంకల్పం (act of god) ప్రకారమే ఇది జరిగి ఉంటుందని’ పేర్కొన్నారు. సాధారణంగా ఊహించని ప్రకృతి విపత్తుల వల్ల నష్టం ఏర్పడితే దానిని act of god అంటారు.

 

కానీ ప్రస్తుత ప్రమాదంలో మాత్రం సంస్థ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఎప్పుడో 2009లో చేపట్టిన ఈ ప్రాజక్టులో ఇంకా 60 శాతం కూడా పూర్తిచేయలేదనీ, నిర్మాణంలో అడుగడుగునా లోపాలు ఏర్పడ్డాయనీ విమర్శలు వినిపిస్తున్నాయి. మమతా దీదీ కూడా సంస్థ మాటలను వినేందుకు సిద్ధంగా లేరు. ఈ ఘటలను బాధ్యులైన వారి మీద కఠినంగా చర్యలు తీసుకుంటామంటూ ఆమె మండిపడుతున్నారు. ఇప్పటికే సంస్థ మీద పోలీసులు ఎఫ్‌.ఐ.ఆర్‌ను నమోదు చేశారు. సంస్థకు చెందిన కొందరు అధికారులు ప్రస్తుతానికి పరారీలో ఉన్నట్లు అనుమానం. బహుశా వారికి ఈ తప్పిదానికి కారణం దైవ సంకల్పం కాదని తెలిసి ఉంటుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...