కోల్ కతాలో అగ్ని ప్రమాదం.. తొమ్మండుగురు సజీవదహనం.!

posted on: Aug 19, 2026 9:35AM

 

కోల్‌కతాలో బుధవారం (ఆగస్టు 19) తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో  తొమ్మండుగురు మృత్యువాత పడ్డారు.  కోల్ కతాలో అత్యంత రద్దీగా ఉండే మిర్జా గాలిబ్ స్ట్రీట్ లో బుధవారం (ఆగస్టు 19) తెల్లవారుజామున దాదాపు  2 గంటల సమయంలో  ఒ భవనంలో చెలరేగిన మంటలు క్షణాల్లోని వ్యాపించాయి.  

ఘటన జరిగిన సమయంలో భవనంలో ఉన్నవారు గాఢ నిద్రలో ఉండటంతో తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ ఘోర అగ్నిప్రమాదంలో మరణించిన తొమ్మిది మందూ బంగ్లాదేశ్ పౌరులేనని గుర్తించారు.  మృతులంతా ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయించుకునేందుకు బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్నవారే.  ఈ ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న వెంటనే అఘటనా స్థలానికి చేరుకున్న    రెస్క్యూ సిబ్బంది  .  గాయపడిన వారిని ఆ స్పత్రికి తరలించారు.   

Kolkata Fire Accident, Mirza Ghalib Street Fire, Bangladeshis Burnt Alive, Kolkata News, West Bengal Fire Tragedy, Fire Accident Today

google-ad-img
    Related Sigment News
    • Loading...