Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కోహ్లీ ఆస్ట్రేలియాలో ఓ జెయింట్ అంబాసిడర్.. పొగడ్తల వర్షం కురిపించిన ఆసీస్ ఉప ప్రధాని
posted on: Jun 2, 2026 10:17AM

ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చారిత్రాత్మక విజయం సాధించి, వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకున్నే సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన పోరులో ఆర్సీబీ అద్భుత ప్రదర్శన చేసింది. ఈ చారిత్రాత్మక విజయంపై దేశ విదేశాల నుండి ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా విరాట్ కోహ్లీపై ప్రశంసల సునామీయే వస్తోంది. ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రధాని, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ కోహ్లీని పొగడ్తలతో ముంచెత్తారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన కోహ్లీకి తాను పెద్ద ఫ్యాన్ అంటూ ప్రశంసించారు.
ఐపీఎల్ ఫైనల్ పోరులో.. టీమిండియా రన్ మెషీన్, ఆర్సీబీ బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీ కేవలం 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 75 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు.
ఈ విజయాన్ని ప్రస్తావిస్తూ రిచర్డ్ మార్లెస్ మాట్లాడుతూ, మైదానంలో విరాట్ కోహ్లీ 75 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచ్ విన్నర్‌గా మారిన తరుణంలో, అతడితో పాటు ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ ఆటగాళ్లు జోష్ హేజిల్‌వుడ్ మరియు టిమ్ డేవిడ్ కూడా కీలక పాత్రలు పోషించారన్నారు. ఈ ముగ్గురి మేళవింపుతో కూడిన ఆర్సీబీ విజయంలో ఇండో-ఆస్ట్రేలియా ద్వైపాక్షిక బంధం స్పష్టంగా కనిపించిందన్నారు.
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ ఒక జెయింట్ బ్రాండ్ అన్న ఆస్ట్రేలియా ఉప ప్రధాని, ఆసీస్ లో కోహ్లీకి విపరీతమైన ఆదరణ ఉందని పేర్కొన్నారు. తాను చిన్నతనంలో బిషన్ సింగ్ బేడీ వంటి భారతీయ క్రికెట్ దిగ్గజాలను చూస్తూ పెరిగానని, నాటి నుండి నేటి వరకు క్రికెట్ అనేది ఇరు దేశాలను కలిపి ఉంచే ఒక బలమైన శక్తిగా మారిందని చెప్పారు.


.webp)
.webp)


