కోహినూర్ భారత్‌కు తిరిగివ్వాలి.. న్యూయార్క్ మేయర్

posted on: Apr 30, 2026 2:09PM

కోహినూర్ వజ్రం భారత్‌కు తిరిగివ్వాలని అమెరికాలోని న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-3ని వ్యక్తిగతంగా కలిసే అవకాశం వస్తే, కోహినూర్ వజ్రాన్ని భారత్‌కు తిరిగి ఇవ్వాలని కోరుతానని తెలిపారు. భారతీయ మూలాలను కలిగిన మమ్దానీ వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. కింగ్ చార్లెస్-3 ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. న్యూయార్క్‌లోని 9/11 దాడుల స్మారక చిహ్మాన్ని సందర్శించారు.

ఒక కార్యక్రమంలో కాకుండా.. కింగ్ చార్లెస్-3ని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడే అవకాశం వస్తే కోహినూర్‌ను భారత్‌కు తిరిగి ఇచ్చెయ్యాలని కోరుతానని బుధవారం (ఏప్రిల్ 29)జరిగిన మీడియా సమావేశంలో మమ్దానీ తెలిపారు. ఆ తర్వాత కింగ్ చార్లెస్-3ని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడే అవకాశం మమ్దానీకి వచ్చింది. అయితే ఆయన కోహినూర్ గురించి కింగ్ చార్లెస్-3తో మాట్లాడారా, లేదా అనే విషయం గురించి సమాచారం బయటకు రాలేదు. కాగా, న్యూయార్క్ మేయర్ వ్యాఖ్యలపై స్పందించేందుకు లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్ నిరాకరించింది.

కాగా, 1849లో మహారాజ్ దులీప్ సింగ్ 108 క్యారెట్ల కోహినూర్ వజ్రాన్ని విక్టోరియా మహారాణికి ఇచ్చేశారు . అప్పట్నుంచి ఆ వజ్రం బ్రిటన్ రాజకుటుంబం ఆధీనంలోనే ఉంది. ఆ వజ్రాన్ని వెనక్కి తీసుకురావాలని భారత ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా దౌత్య మార్గాల ద్వారా ప్రయత్నిస్తోంది. అయితే అందుకు బ్రిటన్ నుంచి సానుకూల స్పందన రావడం లేదు.

google-ad-img
    Related Sigment News
    • Loading...