మాజీ పోలీస్ ఆఫీసర్ అధికారిణికి కూడా అది తప్పదా?

 

డిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశకి చేరుకొంటున్నకొద్దీ ప్రధానంగా పోటీ పడుతున్న బీజేపీ, ఆమాద్మీ పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రం అవుతోంది. మాజీ ఐ.పి.యస్. అధికారిణి, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి అయిన కిరణ్ బేడి ఈరోజు ఆమాద్మీ పార్టీకి చెందిన కుమార్ విశ్వాస్ కొన్ని అసభ్యమయిన మాటలన్నాడంటూ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు.

 

కానీ తన చుట్టూ పదిమంది మీడియావాళ్ళు, ఎన్నికల సంఘానికి చెందిన ఒక అధికారి ఉండగా తాను అసభ్యంగా మాట్లాడనని పిర్యాదు చేయడం కేవలం తనపై బురద జల్లడానికేనని, ఆమె తన ఆరోపణలను రుజువు చేసినట్లయితే తాను రాజకీయ సన్యాసం చేస్తానని ప్రతిసవాలు విసిరారు. కనుక ఇప్పుడు బంతి ఆమె కోర్టులోనే ఉన్నట్లు భావించవలసి ఉంటుంది. ఒకవేళ ఆమె తన ఆరోపణలను రుజువు చేయగలిగినట్లయితే ఆమాద్మీ పార్టీకి గట్టి ఎదురు దెబ్బే తగులుతుంది.