Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...యుద్ధ ట్యాంకర్‌పై కుమార్తెతో కలిసి కిమ్ షికారు
posted on: Mar 22, 2026 11:22AM

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన కుమార్తె కిమ్ జు యేతో కలిసి యుద్ధ ట్యాంకుపై షికారుకు వచ్చారు.. వారిద్దరు కలిసి సైనిక స్థావరాలను సందర్శించారు. ఇద్దరు బ్లాక్ జాకెట్లు ధరించి కనిపించారు.. ట్యాంక్ హ్యాచ్ నుంచి బయటకు వచ్చి నవ్వుతూ కనిపించారు. తన కుమార్తెను పక్కన కూర్చోబెట్టుకుని శిక్షణా కార్యక్రమంలో కిమ్ పాల్గొన్నారు. అలా తండ్రీకూతుళ్లు షికారుకు వెళ్లిన సమయంలో కెమెరాలు క్లిక్ అనిపించాయి. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కిమ్ జోంగ్ ఉన్ తన కూతురు కిమ్-జు-యేతో కలిసి గురువారం ఓ ఆర్మీ ట్రైనింగ్ యూనిట్‌లో పర్యటించారు. అక్కడ ఉత్తర కొరియా ఆర్మీ లైవ్ ఫైరింగ్ డ్రిల్స్‌ను తండ్రీకూతుళ్లు పర్యవేక్షించారు.
కిమ్, కుమార్తెతో కలిసి ట్యాంకర్‌పై వెళుతున్న వెళ్లిన ఫొటోలను విడుదల చేశారు. కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె కిమ్-జు-యే ట్యాంకర్ లోపల కూర్చున్నారు.. తల మాత్రం పైకి కనిపిస్తోంది. కిమ్ ఎప్పటిలాగే లెదర్ బ్లాక్ కోట్ వేసుకుని ట్యాంకర్‌పై నవ్వుతూ కూర్చొని కనిపించారు. కిమ్-జు-యే వయసు 13 ఏళ్లు కాగా.. ఆమె 2022 నుంచి తండ్రితో కలిసి యాక్టివ్‌గా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల కిమ్-జు-యే అధికార కార్యక్రమాలు, మిలటరీ పరేడ్‌లలో పాల్గొన్నారు. స్నైపర్ రైఫిళ్లను ఎక్కిపెట్టి వార్తల్లో నిలిచారు. కిమ్ జోంగ్ ఉన్ తన వారసురాలిగా కూతురు కిమ్-జు-యేను ప్రకటించే అవకాశం ఉందని కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కిమ్ జోంగ్ ఉన్ తన కూతురు కిమ్-జు-యేను వారసురాలిగా ప్రకటించడంపై ఉత్తర కొరియాలో విభిన్న వాదనలు వినిపిస్తున్నాయట. ఈ నిర్ణయాన్ని కొందరు విభేదిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఉత్తరకొరియాలో పాలకవర్గం కిమ్-జు-యేను వారసురాలిగా అంగీకరించనే టాక్ వినిపిస్తోంది. కిమ్ కుమార్తె టీనేజర్ అని కూడా గుర్తు చేస్తున్నారు ఇటీవల. ఉత్తరకొరియాలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ నేతృత్వంలోని కొరియా వర్కర్స్ పార్టీ ఏకంగా 99.93 శాతం ఓట్లను సాధించి చరిత్ర సృష్టించింది. ఉత్తరకొరియాలో మొత్తం 99. 99 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. ఓటేసినవారిలో 99.93% మంది కిమ్‌కు జై కొట్టారు. కేవలం 0.07% మంది మాత్రమే వ్యతిరేకించారు.






