ఇచ్చిన సొమ్ముకు డబల్ అంటూ రూ.20 కోట్లకు టోకరా!

హైదరాబాద్ కు చెందిన శ్రీ విద్య అనే మహిళ తన భర్త రాజశేఖర్ రెడ్డి తో కలిసి ఏపీ కి చెందిన ఒక్క ఎమ్మెల్యే  పిఏ నుండి 2వేల కోట్లు వస్తున్నాయని... 2వేల కోట్లు కోసం కంటైనర్లు కొనాలని  వివిధ ప్రాంతాలకు చెందిన మహిళ లను మోసం చేసి కోట్లులో డబ్బులు వసూలు చేసింది.

ఏపీకి చెందిన విజయసాయిరెడ్డి మరియు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్లు చెప్పి... అమాయక మైన జనాలను నమ్మించి వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేసింది. కొంతమంది వద్ద బంగారం తీసుకునీ ఎక్కువ బంగారం ఇస్తానని నమ్మ బలికింది. ఇలా కూకట్ పల్లి, కెపిహెచ్ బి కాలనీ, మియాపూర్ మొదలగు వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలకు కట్టు కథలు చెప్పి వారి వద్ద నుండి బంగారం, సొమ్ములు వసూలు చేసి ఏకంగా 20 కోట్ల రూపాయల మోసానికి పాల్పడింది.  

అనంతరం పటాన్ చెరుకు మకాం మార్చేసింది. తీసుకున్న డబ్బులు కానీ బంగారం కానీ తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు ఆమెను నిలదీశారు.  దీంతో శ్రీవిద్య వారినందరినీ.. గురువారం సాయంత్రం తన నివాసానికి రమ్మని.. వచ్చిన ఎనిమిది మంది మహిళలను ఒక గదిలో బంధించి, భర్త రాజశేఖరరెడ్డి, తమ్ముడు, పనిమనిషి,  ముగ్గురితో దాడి చేయించింది. ఈ దాడిలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. బాధితుల ఫిర్యాదు మేరకు శ్రీవిద్యపై విద్య మీద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu