‘ఆమ్ ఆద్మీ’కి డూప్లికేట్!

posted on: Apr 2, 2014 2:38PM

 

 

 

అన్ని విషయాల్లో డూప్లికేట్లు వున్నట్టే రాజకీయ పార్టీలలో కూడా డూప్లికేట్లు బయల్దేరాయి. నిన్న మొన్నటి వరకూ ఏమీ కాని అరవింద్ కేజ్రీవాల్ ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ పెట్టి ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడు. అది చూసి స్ఫూర్తి పొందాడేమోగానీ, ముంబైకి చెందిన మిర్జా దస్ హజారే (పేరు అన్నా హజారేలా వుంది) అనే పెద్దాయన ‘ఖాస్ ఆద్మీ పార్టీ’ అనే పార్టీని స్థాపించేశాడు. ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు గుర్తులోకి జనంలోకి వెళ్ళింది కాబట్టి ఈయన డస్ట్ బిన్ గుర్తుతో జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు.


సమాజంలో బడుగు బలహీన వర్గాలు డస్ట్ బిన్‌లోనే వుండిపోతున్నాయని, వాళ్ళందరినీ ఉద్ధరించాలనే, ఆమ్ ఆద్మీని ఖాస్ ఆద్మీగా చేయాలన్న ఉద్దేశంతోనే ఈ ‘ఖాస్ ఆద్మీ పార్టీ’ పెట్టానని మిర్జా దస్ హజారే అంటున్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీ మొదట ఢిల్లీ అసెంబ్లీకి మాత్రమే పోటీ చేశాడు. ఆ తరహాలోనే ఈ ఎన్నికలలో తమ పార్టీ మహారాష్ట్ర అసెంబ్లీకి పోటీ చేయాలని అనుకుంటోంది.

వచ్చే ఎన్నికలలో పార్లమెంట్‌కి కూడా పోటీ చేసే ఆలోచనలో ఖాస్ ఆద్మీ పార్టీ వుంది. తనంటే గిట్టని వాళ్ళు తాను ఆమ్ ఆద్మీ పార్టీని అనుకరిస్తున్నానని అంటున్నారని, అలాంటిదేమీ లేదని మిర్జా అంటున్నాడు. ఇంతకీ ఈ మిర్జా తక్కువ వాడేం కాదు.. దిలీప్ కుమార్, దేవానంద్ లాంటి బాలీవుడ్ నటులకు, రామ్ జఠ్మలానీ వంటి సుప్రసిద్ధ న్యాయవాదికి పర్సనల్ టైలర్.

google-ad-img
    Related Sigment News
    • Loading...