Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఖమేనీ భార్య కూడా మృతి
posted on: Mar 3, 2026 9:40AM

అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ శనివారం (ఫిబ్రవరి 28) తొలిసారి టెహ్రాన్‌పై జరిపిన దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ భార్య మన్సూరే ఖోజాస్తే సోమవారం (మార్చి 2) మరణించారు. ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తెలిపింది.
ఖమేనీ నివాసంపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటికే ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనుమరాలు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఖమేనీ మృతితో ఇప్పటికే ఉద్రిక్తతలు చోటుచేసుకోగా, మన్సూర్ ఖోజాస్తే కూడా మరణించడంతో టెహ్రాన్ నాయకత్వంపై ఒత్తిడి పెరిగి ఉద్రితకలు మరింత పెరిగే అవకాశాలున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.






