Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హైదరాబాద్‌లో మైక్రో ఫైనాన్స్ కేసు సంచలనం... కొత్త ట్విస్ట్‌తో మంగ్లీకి ఊరట?
posted on: Apr 15, 2026 3:09PM
.webp)
హైదరాబాద్‌లో గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా మారిన మైక్రో ఫైనాన్స్ వివాదం కేసు ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ పేరు చుట్టూ తిరుగుతున్న ఈ కేసులో కీలక వ్యక్తి అప్రూవర్‌గా మారి సంచలన వ్యాఖ్యలు చేయడంతో కేసు కీలక మలుపు తీసుకుంది. కొద్ది రోజుల క్రితం న్యాయవాది సుబ్బారావు, మంగ్లీ మైక్రో ఫైనాన్స్ పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించడం తెలిసిందే. దీనికి ప్రతిగా మంగ్లీ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ను కలిసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న మధు అప్రూవర్‌గా మారి వెల్లడించిన విషయాలు సంచలనంగా మారాయి. మంగ్లీకి ఈ వ్యవహా రంతో ఎలాంటి సంబంధం లేదని మధు స్పష్టంగా పేర్కొన్నాడు. అసలు మోసం చేసిన వ్యక్తి హిమాకాంత్ రెడ్డి అని మధు ఆరోపించారు. కంపెనీలో పెట్టిన దాదాపు రూ.20 కోట్లు హిమాకాంత్ రెడ్డి తీసుకున్నాడని మధు ఆరోపించాడు.
హిమా కాంత్ రెడ్డి, సుబ్బారావు స్నేహితులని చెప్పిన మధు.. సుబ్బారావును తనకు హిమాకాంత్ రెడ్డే పరిచయం చేశాడని వెల్లడించారు. హిమాకాంత్ రెడ్డి నుండి డబ్బులు తిరిగి ఇప్పిస్తానని సుబ్బారావు చెప్పాడనీ, అందుకు ప్రతిగా సినీ సెలబ్రిటీల ఫోన్ నంబర్లు కావాలని అడిగాడని అప్రూవర్ గా మారిన మధు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక అసలైన బాధితులు కాకుండా వేరే వ్యక్తులు ముందుకు వస్తు న్నారని మధు వ్యాఖ్యా నించడం ఈ కేసును మరింత క్లిష్టంగా మార్చింది. మధు అప్రూవర్‌గా మారడంతో కేసు పూర్తిగా కొత్త కోణంలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తు న్నాయి. ఇప్పటి వరకు ఆరోపణల మధ్య చిక్కుకున్న మంగ్లీకి ఇది కొంత ఊరట కలిగించే పరిణామంగా పరిశీలకులు భావిస్తున్నారు.






