Latest News

2026 టీ20 ఫైన‌ల్స్.. గెలుపు వీరులు వీరే!

posted on: Mar 9, 2026 6:55AM

టి20 వరల్డ్ కప్ ఫైనల్ లో టీమ్ ఇండియా వన్డే మ్యాచ్ లో కూడా భారీ స్కోరే అనదగ్గ స్కోరును 20 ఓవర్లలో చేసింది. అవును నిర్ణీత 20 ఓవర్లలో టీమ్ ఇండియా ఏకంగా 256 పరుగులు చేసింది. ఇందుకు ప్రధాన కారణం టాప్ ఆర్డర్డ్ బ్యాటర్లు ముగ్గురూ హాఫ్ సెంచరీలు చేయడం.ఈ ముగ్గురిలో కూడా ఓపెనర్ సంజూ శాంస‌న్ కీల‌క పాత్ర పోషించాడు.  46 బంతుల్లో టీ ట్వంటీ  ఫైన‌ల్స్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోరు సాధించిన బ్యాట‌ర్ గా రికార్డు బ్రేక్ చేశాడు, దానికి తోడు క్వార్ట‌ర్ ఫైన‌ల్స్, సెమీ ఫైన‌ల్స్, ఫైన‌ల్స్ లో వ‌రుస హాఫ్ సెంచురీలు చేసి ప్లేయ‌ర్ ఆఫ్ ద టోర్న‌మెంట్ గా నిలిచాడు శాంస‌న్.

 ఆ తరువాత బుమ్రా.. బుమ్రా ఈ ఫైనల్ లో 4 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 15 ప‌రుగులు  ఇచ్చి నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఫైన‌ల్స్ లో అత్యుత్త‌మ గ‌ణాంకాలు న‌మోదు చేసి ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు. ఈ టోర్నీలో బుమ్రా మొత్తం 14 వికెట్లు తీసి వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తితో క‌ల‌సి హ‌య్య‌స్ట్ వికెట్ టేక‌ర్ గా నిలిచాడు. అలాగే అభిషేక్ శర్మ,  ఇషాన్.. ఈ ఇరువురూ కూడా  ఈ విక్టరీలో కీలక పాత్ర పోషించిన వారే. అభిషేక్  కేవ‌లం 18 బంతుల్లోనే యాభై ప‌రుగులు చేసి.. టోర్నీలోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ పూర్తి చేయడమే కాకుండా కీలక ఫైనల్ లో . భార‌త్ కు కళ్లు చెదిరే ఆరంభాన్ని అందించాడు. అలాగే ఇషాన్ కిష‌న్ పాతిక బంతుల్లో 54 ప‌రుగులు చేసి మిడిల్ ఓవ‌ర్ల‌లో ప‌రుగుల వేగం త‌గ్గ‌కుండా  చూశాడు. 

ఒక వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్స్ లో ఒకే మ్యాచ్ లో టాప్ త్రీ బ్యాట్స్ మ‌న్ అర్ధ శ‌త‌కాలు చేయ‌డం కూడా ఇదే తొలిసారి. ఇక శివందూబె గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి చివరి ఓవర్లలో సిక్సర్లతో చెలరేగిపోయి టీమ్ ఇండియా ఇన్నింగ్స్ ఒక అద్భుత ముగింపు ఇచ్చారు. కేవ‌లం 8 బంతుల్లో 26 ప‌రుగులు సాధించి.. భార‌త్ స్కోర్   250 దాటించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు అలాగే అక్షర్ పటేల్..  త‌న హోం గ్రౌండ్ అయిన అహ్మ‌దాబాద్ లో   అద్భుతంగా  రాణించాడు. మ‌రీ ముఖ్యంగా ఓపెన‌ర్ ఫిన్ అలెన్ ను త‌న తొలి ఓవ‌ర్లోనే ఫెవిలియ‌న్ బాట ప‌ట్టించ‌డంతో ఒక రకంగా మ్యాచ్ ను మలుపు తిప్పాడని చెప్పవచ్చు.    ఇక ఫీల్డింగ్ లో ఇషాన్ కిషన్ రెండు అద్భుత క్యాచ్ లు పట్టాడు.  లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లు  గౌతం గంభీర్  హెడ్ కోచ్ గా   భార‌త్ రెండో ఐసీసీ  ట్రోఫీని అందించాడు. ఈ వరల్డ్ కప్ విక్టరీలో గంభీర్   పాత్ర కీలకం అనడంలో సందేహం లేదు. .

google-ad-img
    Related Sigment News
    • Loading...