వివేకాహత్య కేసు విచారణలో కీలక మలుపు

posted on: Feb 20, 2026 1:56PM

నిందితులకు 13 లక్షల డిజిటల్ ఫైల్స్

సాంకేతిక సమస్యలపై కోర్టు దృష్టి

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక కోర్టులో శుక్రవారం జరిగిన విచారణకు ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి సహా మిగిలిన నిందితులు హాజరయ్యారు. విచారణ సందర్భంగా భారీ స్థాయిలో డిజిటల్ ఆధారాలను నిందితులకు అందజేయడం కేసులో కొత్త మలుపుగా మారింది. కోర్టు ఆదేశాల మేరకు  సీబీఐ అధికారులు కేసుకు సంబంధించిన మొత్తం 13 లక్షల ఫైల్స్‌ను హార్డ్‌డిస్క్‌ల రూపంలో నిందితుల తరఫు న్యాయవాదులకు అందజేశారు.

ఈ డిజిటల్ డేటాలో కాల్ డేటా, ఫోరెన్సిక్ రిపోర్టులు, సాక్షుల వాంగ్మూలాలు, ఎలక్ట్రానిక్ ఆధారాలు, పత్రాలు వంటి కీలక సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది.అయితే సీబీఐ అందజేసిన హార్డ్‌డిస్క్‌ల లోని కొన్ని ఫైల్స్ ఓపెన్ కావడం లేదని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువ చ్చారు. ఫైల్స్ యాక్సెస్ చేయడంలో సాంకేతిక సమస్యలు ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో డేటాను పూర్తి గా పరిశీలించడం కష్టమ వుతోందని వాదించారు. అంత భారీ పరిమాణంలో ఉన్న డిజిటల్ ఆధారాలను పరిశీలించేందుకు సమయం అవసరమని కూడా తెలిపారు.ఇంకా, 13 లక్షల ఫైల్స్‌లో ఏ ఫైల్‌లో ఏమి సమాచారం ఉందో తెలియజేసేలా ఇండెక్స్ రూపంలో వివరాలు అందించాలని న్యాయ వాదులు కోర్టును కోరారు. లేకపోతే కేసు విచారణకు తగిన విధంగా సిద్ధం కావడం సాధ్యం కాదని స్పష్టం వ్యక్తం చేశారు.

ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను మార్చి 9కి వాయిదా వేసింది. అప్పటిలోగా హార్డ్‌డిస్క్‌లలోని సాంకేతిక లోపాలపై స్పష్టత ఇవ్వాలని, ఇండెక్స్ విష యంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించి నట్లు సమాచారం.ఇప్పటికే రాజకీయంగా, చట్టపరంగా అత్యంత ప్రాధాన్యత సంతరించు కున్న ఈ కేసులో డిజిటల్ ఆధారాల పరిశీలన కీలకం గా మారింది. సీబీఐ సమర్పించిన ఈ భారీ డేటా కేసు దిశను ప్రభావితం చేసే అవకాశం ఉందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. తదుపరి విచారణలో మరిన్ని కీలక పరిణామాలు చోటుచే సుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...