కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం...ప్రధాని కార్యాలయం పేరు మార్పు

posted on: Feb 14, 2026 2:06PM

 

ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  ప్రధాని కార్యాలయం పేరును సేవతీర్థ్‌గా మార్చాలని నిర్ణయించారు. అలాగే ఢిల్లీ- అంబాలా మధ్య 2 కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోద ముద్ర వేశారు. గుడబెళ్లూరు-మహబూబ్‌నగర్ 4 లైన్ల హైవే నిర్మాణానికి రూ.3,175 కోట్ల నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మహబూబ్‌నగర్ , నారాయణపేట, రాయచూర్, దేవరకద్ర, హైదరాబాద్‌కు ఈ కనెక్టివిటీ ఉంది. హైదరాబాద్ - పనాజీ కారిడార్‌లో భాగంగా కొత్త నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం చేపట్టనుంది. 

80 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.3175 కోట్ల ఖర్చు చేయనుంది. దమాసియా - బిటాడ నర్సాపూర్ మలోత సెక్షన్ మధ్య నాలుగు లైన్ల నిర్మాణానికి రూ.4,584 కోట్లను ఖర్చు చేయనుంది. గోతి- ట్రిమ్బక్ - పాల్గర్ సెక్షన్ అబ్రిడేషన్ కోసం రూ.3320 కోట్లని కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. గోహుపూర్ - నుమాలిఘర్ మధ్య అండర్ వాటర్ రోడ్డు టన్నెల్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదించింది. 
 

google-ad-img
    Related Sigment News
    • Loading...