రో-కోల కోసం కివీస్ టూర్ షెడ్యూల్లో కీలక మార్పులు..

posted on: Mar 4, 2026 8:58PM

 

టీమిండియా వెటరన్ స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల కోసం బీసీసీఐ న్యూజిలాండ్‌తో సిరీస్‌నే మార్చేసింది. రో-కోలు ఇప్పటికే టెస్ట్, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. వారికున్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ను క్యాష్ చేసుకోవడానికి కివీస్ క్రికెట్ బోర్డు చేసిన ప్రతిపాదనకు బీసీసీఐ నిరభ్యంతరంగా అంగీకరించిందంట. 

ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. షెడ్యూల్ ప్రకారం అక్కడ ఐదు టీ20లు, రెండు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే టీ20 సిరీస్‌ను తగ్గించి.. వన్డే సిరీస్‌లో అదనంగా రెండు మ్యాచ్‌లు పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. వన్డే ప్రపంచ కప్ సమీపిస్తోన్న తరుణంలో రోహిత్, విరాట్ కోసం బీసీసీఐ ఈ మార్పు చేయనుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి

ఈ ప్రతిపాదనను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డే బీసీసీఐకి పంపినట్లు తెలుస్తోంది. వన్డే మ్యాచ్‌లు పెరిగితే రోహిత్, విరాట్ లాంటి స్టార్ ప్లేయర్లు ఎక్కువగా మైదానంలో ఉండే అవకాశం ఉంటుంది. దీంతో టీవీ రేటింగ్స్, స్పాన్సర్ల ఆదాయం కూడా పెరుగుతుందని న్యూజిలాండ్ భావిస్తోంది. ఈ ప్రతిపాదనకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఈ అంశంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ ఏడాది టీమిండియా.. జూన్‌లో అఫ్గానిస్తాన్, జులైలో ఇంగ్లండ్, ఆ తర్వాత వెస్టిండీస్, ఏడాది చివరిలో శ్రీలంక జట్లతో వన్డే సిరీస్‌లు ఆడనుంది. సిరీస్‌లన్నీ వరల్డ్ కప్‌నకు సన్నాహకంగా ఉపయోగపడనున్నాయి.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...