హైదరాబాద్ కేంద్రంగా రూ. 13వేల కోట్ల ఆన్‌లైన్ గేమింగ్ మోసం
posted on: Feb 20, 2026 8:38AM

దేశవ్యాప్తంగా విస్తరించిన ఆన్‌లైన్ గేమింగ్ అక్రమ సామ్రాజ్యంపై కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగండీజీజీఐ దాడులు నిర్వహించి భారీ మోసాన్ని బట్టబయలు చేశారు. దాదాపు 13 వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు భావిస్తున్న గేమింగ్ సిండికేట్ కేసులో కీలక మలుపుగా హైదరాబాద్‌లో కీలక అరెస్టు జరిగింది. డిజిటల్ కేవైసీ, ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంట్ సేవలు అందిస్తున్న అడ్సమ్ అడ్వైజరీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ పంకజ్ కుమార్ ను అధికారులు అదుపులోకి తీసు కున్నారు. దర్యాప్తులో సేకరించిన సాంకేతిక, ఆర్థిక ఆధారాలు ఈ మోసం వ్యవస్థాబద్ధంగా నడిచినట్లు తేటతెల్లం చేస్తున్నాయి. నకిలీ కేవైసీ పత్రాలతో వందలాది షెల్ సంస్థలను పేమెంట్ నెట్‌వర్క్ లలోకి చేర్చి, వాటికి యూపీఐ ఆధారిత లావాదేవీల సౌకర్యం కల్పించినట్లు డీజీజీఐ అధికారులు గుర్తించారు.
ఈ మార్గం ద్వారా ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో వచ్చిన అక్రమ నగదు దేశవ్యాప్తంగా చలామణి అయినట్లు భావిస్తున్నారు. ప్రాథమిక విచారణలో పేమెంట్ అగ్రిగేటర్లు, పేమెంట్ గేట్‌వేలు, మూడో పార్టీ టెక్నాలజీ సేవాదారుల పాత్రపై కూడా అనుమా నాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్బీఐ నియంత్రణలో ఉన్న సంస్థల తరఫున నిర్వ హించాల్సిన కస్టమర్ వెరిఫికేషన్ ప్రక్రియను దుర్వి నియోగం చేసి, మోసపూ రిత ధృవీకరణలు జరిగి నట్లు అధికారులు చెబుతున్నారు. సరైన యాజ మాన్య వివరాలు లేకపో యినా, అనుమానాస్పద సంస్థలను వ్యవస్థలోకి చేర్చడం ఈ కేసులో కీలక అంశంగా మారింది. దర్యాప్తు సంస్థల కథనం మేరకు ఈ అక్రమ లావా దేవీల ద్వారా వచ్చిన డబ్బులో కొంత భాగం నిందితులకు చేరినట్లుగా అధికారులు గుర్తించారు.
పంకజ్ కుమార్ కూడా ఈ నెట్‌వర్క్ ద్వారా లబ్ధి పొందిన వ్యక్తుల్లో ఒకరని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న అనేక బ్యాంకు ఖాతాలను అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకూ దాదాపు వంద కోట్ల రూపాయల నిధులను సీజ్ చేశారు. అనుబంధ సంస్థలు, మధ్య వర్తులు, టెక్నాలజీ భాగస్వా ముల పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ భారీ ఆన్ లైన్ గేమింగ్ మోసంలో కీలక మాస్టర్‌మైండ్ లను గుర్తించేందుకు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు త్వరలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు అంటున్నాయి.


.webp)
.webp)


