ఢిల్లీ బ్లాస్ట్.. మరో కీలక నిందితుడి అరెస్టు
posted on Nov 18, 2025 9:10AM
.webp)
దేశ రాజధాని నగరం ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ ప్రాంతంలో జరిగిన ఘోరమైన కారు బాంబు పేలుడు కేసు దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ కీలక ముందడుగు వేసింది. ఈ కేసుకు సంబంధించి మరో కీలక నిందితుడిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఢిల్లీ పేలుడు ఘటనలో 13 మంది మరణించగా, మరో 32 మంంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్ఐఏ కారు బాంబు పేలుడు ఘటనకు పాల్పడిన వారిని అరెస్టు చేయగా, తాజాగా మరో కీలక నిందితుడిని అరెస్టు చేసింది.
శ్రీనగర్‌లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించిన ఎన్‌ఐఏ బృందం, కశ్మీర్‌కు చెందిన జాసిర్ బిలాల్ వాని అలియాస్ డానిష్ ను అరెస్టు చేసింది. అతడు కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా, ఖాజిగుండ్ ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. ఎన్‌ఐఏ దర్యాప్తులో జాసిర్ ఉగ్రవాద దాడులకు సాంకేతిక సహాయం అందించిన వ్యక్తిగా గుర్తించింది. డ్రోన్లను సమకూర్చడం, రాకెట్లు తయారు చేయడానికి ప్రయత్నించడం వంటి కీలక కార్యకలాపాలకు అతడు నేరుగా సహక రించినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.
పేలుడు జరిగే ముందు ఉగ్రవాద చర్యలను అమలు చేయడంలో అతడి పాత్ర ఉందనిఎన్ఐఏ తెలిపింది.జాసిర్ బిలాల్ వాని పేలుడు ప్రధాన కుట్రదారుడిగా భావిస్తున్న ఉగ్రవాది ఉమర్ ఉన్ నబీతో కలసి ఈ దాడిని ప్లాన్ చేసినట్టు ఎన్‌ఐఏ తెలిపింది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.