Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పట్టువస్త్రం వివాదం.. ఎంపీది హుందాతనం.. కొలికపూడిది అరాచకం
posted on: Mar 4, 2026 2:58PM
.webp)
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ , తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య విభేదాలు తెలియనివి కావు. అయితే ఆ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఇరువురి మధ్యా విభేదాల ఒక ఆలయంలో జరుగుతున్న ఆధ్మాత్మిక కార్యక్రమం సందర్భంగా భగ్గుమనడం సంచలనం సృష్టించింది. అయితే పరిస్థితి అదుపు తప్పకుండా ఎంపీ కేశినేని హుందాగా వ్యవహరించగా, ఎమ్మెల్యే కొలికపూడి తీరు అరాచకంగా ఉందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఇంతకీ జరిగిందేంటంటే.. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు.
నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు. తలంబ్రాలను ఎమ్మెల్యే కొలికపూడికి ఇచ్చారు. అయితే, పట్టువస్త్రాలు తనకే ఇవ్వాలని, స్థానిక ఎమ్మెల్యేగా ఆ గౌరవం తనకే దక్కాలని కొలికపూడి పట్టుబట్టారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఫలితం లేకపోవడంతో కొలికపూడి హద్దుదాటి ప్రవర్తించారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వెడుతున్న ఎంపీ కేశినేని చిన్ని చేతుల్లోంచి లాగేసుకున్నారు.
మామూలుగా అయితే కొలికపూడి తీరుతో అక్కడ పెద్ద ఘర్షణ జరిగి ఉండేది. కానీ కేశినేని చిన్ని తన వర్గీయులను శాంతంగా ఉండాలంటూ ఘర్షణ నివారించడమే కాకుండా కొలికపూడి స్వామి వారికి పట్లు వస్త్రాలను సమర్పించే కార్యక్రమాన్ని నవ్వుతూ తిలకించారు. సామాన్య భక్తులతో కలిసి స్వామివారి కల్యాణాన్ని వీక్షించారు. దీంతో స్వామి వారి సమక్షంలో పరిస్థితి అదుపు తప్పకుండా కేశినేని చిన్ని హుందాగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. అదే సమయంలో కొలికపూడి తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతుున్నాయి.


.webp)



