Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Podharillu : మాధవని కొట్టిన పురుషోత్తం.. చక్రి, కేశవ ఏం చేయనున్నారు!
posted on: Mar 11, 2026 11:17AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -67 లో.... శైలు తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఆ కేశవ గాడికి డబ్బు ఇచ్చి.. నా ఫోన్ నేను తీసుకోవాలి.. ప్లీజ్ డబ్బు అరెంజ్ చెయ్ అని తన ఫ్రెండ్ ని రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో తన ఫ్రెండ్ సరే అంటుంది. అప్పుడే తన వెనకాల అమ్మ ఉంటుంది. ఏంటో ఫోన్ తీసుకోవాలని అంటున్నావ్ అంటుంది. దాంతో వాళ్ళ అన్న వచ్చి కవర్ చేస్తాడు. శైలు దగ్గర ఒక వంద తీసుకుంటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. తనని హగ్ చేసుకొని ఏడుస్తుంది. బావ నాకు పెళ్లి చేస్తారంట.. నాకు వేరే పెళ్లి ఇష్టం లేదు.. నిన్ను తప్ప ఎవరిని చేసుకోనని గాయత్రీ ఏడుస్తుంది. అప్పుడే తాయారు వాళ్ళ ఆయన పురుషోత్తమ్ వచ్చి గాయత్రి, మాధవ్ హగ్ చేసుకోవాడం చూస్తాడు. గాయత్రిని పక్కకి నెట్టి మాధవని కొడతాడు. పక్కనే ఉన్న మహా ఆయన ఏం తప్పు చేసాడని కొడుతున్నారు.. వచ్చింది మీ అమ్మాయి కదా అని మహా అంటుంది.
అలా ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే ఎలా ఉంటుందని మహా అనగానే అందరిని నీలా తెగించమంటున్నావా అని మహాపై తాయారు కోప్పడుతుంది. ఆ తర్వాత మీ ఇద్దరు కలవడం ఇదే చివరిసారి అవ్వాలని గాయత్రిని అక్కడ నుండి తీసుకొని వెళ్తారు. మరొకవైపు కేశవ డబ్బు తీసుకోవడానికి వెళ్తాడు. తన ఫ్రెండ్ డబ్బు తీసుకొని వస్తుందని శైలు ఇష్టం వచ్చినట్లు కేశవని తిడుతుంది. అప్పుడే తన ఫ్రెండ్ వచ్చి పక్కకి తీసుకొని వెళ్లి డబ్బు అడ్జెస్ట్ అవ్వలేదని చెప్తుంది. దాంతో మళ్ళీ కేశవని రిక్వెస్ట్ చేస్తుంది శైలు. అసలుతో పాటు ఇప్పటివరకు నువ్వు తిట్టిన తిట్లకి వడ్డీ ఇచ్చి.. నీ ఫోన్ తీసుకొని వెళ్ళు అని కేశవ వెళ్తాడు. ఆ తర్వాత మాధవని కొట్టిన విషయం మహా గుర్తుచేసుకొని చక్రికి ఫోన్ చేసి త్వరగా ఇంటికిరా మీ అన్నయ్యని కొట్టారని జరిగింది మొత్తం చేప్తుంది. ఆ తర్వాత కేశవకి చక్రి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తాడు. ఇద్దరు ఇంటికి వస్తారు.
మాధవ పనికి వెళ్తుంటే ఏంటి పెద్ది ఏం జరుగనట్లు వెళ్తున్నావని మహా అడుగతుంది. అప్పుడే చక్రి, కేశవ వచ్చి నిన్ను కొడతాడా.. వాడి సంగతి చెప్తామని మాధవ వద్దు అంటున్నా తనని తీసుకొని చక్రి, కేశవ కలిసి గాయత్రి ఇంటికి వెళ్తారు. మరొకవైపు నా కూతురిని నీకు నమ్మి వెళ్ళాను కానీ దాన్ని మీరు ఊరుమీద వదిలేసి వెళ్లారని తాయారు ఇంకా వాళ్ళ అన్నయ్యపై పురుషోత్తం కోప్పడతాడు. తాయారుని కొట్టబోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






