దారుణం.. క్లాస్ రూంలోనే పెట్రోల్ పోసి నిప్పంటించిన విద్యార్ధి

posted on: Feb 2, 2017 10:52AM

 

ఆడవాళ్లపై ఘోరాలు జరగడం చూస్తూనే ఉన్నాం. ఎన్ని చట్టాలు వచ్చినా.. ఎంత మందికి శిక్షలు పడుతున్నా జరిగే నేరాలు మాత్రం జరగుతూనే ఉన్నాయి. అలాంటి దారుణమైన ఘటనే ఇప్పుడు కేరళలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కేరళలోని కొట్టాయంలో ఉన్న ఎస్ఎంఈ మెడికల్ కాలేజీలో క్లాసులో అందరూ చూస్తుండగానే ఆదర్శ్ అనే యువకుడు 20 ఏళ్ల వైద్య విద్యార్థినిపై పెట్రోలు ఆ తర్వాత తాను కూడా పెట్రోల్ పోసుకున్నాడు. దాంతో అమ్మాయి భయంతో పరుగులు పెరిగెత్తగా.. అతను ఆమె వెంటే పరిగెత్తి... పట్టుకొని నిప్పంటించాడు. ఆ తర్వాత తాను కూడా నిప్పంటించుకున్నాడు. దీంతో అక్కడ ఉన్న తోటి విద్యార్ధులు యువతిని కాపాడేందుకు ప్రయత్నించగా.. వారికి కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనతో కాలేజీలో ఒక్కసారిగా విషాద వాతావరణం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...