Latest News

270 ఏళ్ల తర్వాత కేరళ కుంభమేళా

posted on: Jan 20, 2026 12:12PM

కేరళలో సుమారు 270 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పునఃప్రారంభమైన ‘కేరళ కుంభమేళా’ ..మహామాఘ మహోత్సవం.. ఒక చారిత్రక ఘట్టంగా నిలవనుంది. ఈ ఉత్సవానికి వేలాదిగా భక్తులు తరలివ స్తున్నారు. కేరళలోని నీలా నది తీరంలో కేరళ కుంభమేళాగా చెప్పకునే  మహామాఘ మహోత్సవం మలప్పురం జిల్లా తిరునవయలో ప్రారంభమైంది. ఈ కుంభమేళాను కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్.. ధర్మ ధ్వజాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు.  మహామాఘ మహోత్సవం లో మొదటి స్నానం నవముకుంద ఆలయ స్నాన ఘాట్‌లో మాహామండలేశ్వర్ స్వామి ఆనందవనం భారతి మహారాజ్ నేతృత్వంలో జరిగింది.  270 ఏళ్ల తర్వాత సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఉత్సవాన్ని పూర్తి‌స్థాయిలో నిర్వహించడం విశేషం. ప్రభుత్వ రికార్డుల ప్రకారం కేరళ కుంభ మేళ 1755 లో జరిగినట్లు సమాచారం.

ఫిబ్రవరి 3 వరకు కేరళ కుంభమేళా కొనసాగుతుంది. ఈ ఉత్సవానికి కేరళ, తమిళనాడు సహా దేశంలోని అనేక ప్రాంతాల నుంచి రోజుకు దాదాపు 50 వేల మందికి పైగా భక్తులు నీలా నదిలో పవిత్న స్నానాలు ఆచరించేందుకు విచ్చేస్తుంటారు. ప్రతిరోజూ కాశీ పండితుల ఆధ్వర్యంలో సాయంత్రం నీలా హారతి నిర్వహించనున్నారు. భక్తుల సౌకర్యార్థం కేరళ ఆర్టీసీ 100 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అంతేకాదు, పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, యోగా, కలరిపయట్టుతోపాటు పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...