రాహుల్, కేజ్రీ కూడా 'భక్తుల' లిస్ట్ లో చేరిపోయారు!

posted on: Oct 3, 2016 6:22PM

నరేంద్ర మోదీ క్రేజ్ ఇప్పుడు కాదు... 2014 ఎన్నికల ముందే తార స్థాయికి చేరింది. దాని ఫలితమే చరిత్రలో తొలిసారి బీజేపి స్వంత మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే, ఎన్నికల్లో గెలుపు, ప్రధాని అవ్వటం ఇవేవీ ఇద్దరు యంగ్ అండ్ డైనమిక్ లీడర్లను మాత్రం మార్చలేకపోయాయి! వారే రాహుల్ గాంధీ, కేజ్రీవాల్! 


జాతీయ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ... మోదీని టార్గెట్ చేయటం కొత్తా కాదు... అందులో విశేషమూ లేదు! అలాగే, కేజ్రీవాల్ కూడా మోదీని విమర్శిస్తూ మీడియా ముందుకి రావటం ఏ మాత్రం మాట్లాడుకోవాల్సిన విషయం కాదు. అంతలా వారు రోజూ మోదీ వ్యతిరేకతలోనే జీవించే్స్తుంటారు. కాని, ఈ మధ్య జరిగిన పాక్ పై సర్జికల్ ఎటాక్స్ ... సీన్ మొత్తం మార్చేశాయి! అసలు సిసలైన వార్తల్ని జనం వద్దకి మోసుకొచ్చాయి!. ఎప్పుడూ మోదీ అంటే అగ్గి మీద గుగ్గిలం అయిపోయే రాహుల్ గాంధీ కొన్ని రోజుల క్రితం ఆయన్ని సమర్థించాడు. మోదీ ప్రధాని అయ్యాక తన స్థాయికి తగ్గ పని తొలిసారి చేశాడని నెగటివ్ టోన్ లోనే మాట్లాడినా ... మద్దతుగా అయితే నిలిచాడు. పాక్ పైన సర్జికల్ స్ట్రైక్స్ బేష్ అన్నాడు!

రాహుల్ గాంధీలాగే తాజాగా కేజ్రీవాల్ కూడా మోదీ గ్రేట్ అన్నాడు. ప్రపంచంలో ఏ తప్పు, గందరగోళం జరిగినా దానికి కారణం... మోదీనే అనే కేజ్రీ ఈసారి నమో సూపర్ అన్నాడు. పాక్ పై చేసిన దాడిని సమర్థిస్తూనే కేజ్రీవాల్ ఇండియన్ ఆర్మీని పొగడ్తలతో ముంచేశాడు. కాకపోతే, పాక్ అంతర్జాతీయంగా ఇండియాపై అనుమానాలు రేకిత్తిస్తోందని ... సర్జికల్ స్ట్రైక్స్ జరిగినట్టు ఆధారాలు లేవంటోందని అన్నాడు. పాక్ దుష్ఫ్రచారం తిప్పిగొట్టాలని మోదీకి సూచించాడు!

రాహుల్, కేజ్రీవాల్ మోదీకి మద్దతుగా నిలవటం నిజంగా ఆనందకరం. దేశం యుద్ధం ముంగిట్లో వున్నప్పుడు అందరూ ప్రధాని వెనుక నిలవాల్సిందే. కాని, రాహుల్, కేజ్రీవాల్ బేషరతుగా మోదీని మెచ్చుకుని వుంటే మరింత బావుండేది. అంతగా పరిణతి ప్రస్తుత రాజకీయ నేతల నుంచి ఆశించటం దురాశే అవుతుంది! 
 

google-ad-img
    Related Sigment News
    • Loading...