కీసర బ్రహ్మోత్సవాల్లో విఐపీ సిఫార్సులు పనిచేయవు : పోలీసులు

posted on: Feb 14, 2026 3:23PM

 

కీసరగుట్టలో జరుగనున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యం, భద్రత దృష్ట్యా పోలీసులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫిబ్రవరి 13, 2026 నుండి 18, 2026 వరకు నిర్వహించబడే ఉత్సవాల కాలంలో ఎలాంటి విఐపీ లేదా ప్రత్యేక పాసులు జారీ చేయబడవని స్పష్టం చేశారు. బ్రహ్మోత్సవాల సమయంలో కీసరగుట్ట పైకి ఎలాంటి వ్యక్తిగత వాహనాలు అనుమతించ బడవు. ప్రతి భక్తుడు తప్పని సరిగా ఏర్పాటు చేసిన నిర్దేశిత క్యూలైన్ ద్వారానే దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. 

వాహనదారులు తమ వాహనాలను కేటా యించిన పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే నిలిపివేయాలని సూచించారు. ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ప్రజలు వీలైనంత వరకు ప్రభుత్వ రవాణా సౌకర్యాలను వినియోగించుకోవాలని కోరారు. కీసరగుట్ట కమాన్‌ నుండి అలాగే అన్ని పార్కింగ్ ప్రదేశాల నుండి ఆలయం వరకు ప్రత్యేక ఉచిత షటిల్ బస్ సర్వీ సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు ఈ ఉచిత సదుపాయాలను వినియోగించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. 

ప్రత్యేకంగా మహాశివరాత్రి పర్వదినాన భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశ మున్నందున, శ్రీ రామలింగే శ్వర స్వామి ఆలయంలో దర్శనం సాఫీగా సాగేందుకు అదనపు క్యూలైన్లు, తాగు నీటి సదుపాయం, వైద్య శిబిరాలు మరియు సహా యక సిబ్బందిని ఏర్పాటు చేశారు.పోలీసుల సూచ నలు అతిక్రమించి ఇతర భక్తులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. బ్రహ్మోత్సవాలు ప్రశాంతం గా, విజయవంతంగా జరిగేందుకు ప్రజలందరూ పోలీస్ శాఖకు సహకరించా లని అధికారులు మనవి చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...