అసలే టెన్షన్ టెన్షన్.. మరో వంక కేటీఆర్
posted on Aug 27, 2022 11:27AM
హైదరాబాద్ పాతబస్తీలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను అరెస్టు చేయడం ఆయనపై పీడీ యాక్టు విధించడంతో పరిస్థితులు అదుపుతప్పాయి. భజరంగ దళ్ వీహెచ్‌పీ కార్యకర్తలు మండిపడుతున్నారు. దీంతో చాంద్రాయణగుట్ట ప్రాంతం హైటెన్షన్ చోటు చేసుకుంది. ఈ పరిస్థితుల్లో కేటీఆర్ చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి పూను కున్నారు.
ఈనెల 23న ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం కావాల్సి ఉండగా బీజేపీ నేతల ఆందోళనలతో వాయిదా పడింది. రాజాసింగ్ అరెస్టు అనంతరం ఓల్డ్ సిటీలో ఘర్షణలతో చాంద్రాయణ గుట్టలో పోలీసులు హై అలర్ట్ ప్రక టించారు. భజరంగ్‌దళ్, వీహెచ్‌పీ కార్యకర్తలు అడ్డుకుంటారనే సమాచారంతో భారీగా పోలీసులు మోహ రించారు.
గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేసి మంగళహాట్ పోలీసులు కోర్టుకు తరలించిన తర్వాత పీడీయాక్ట్ నమోదు చేసిన విషయాన్ని ప్రకటించారు. అంతకు ముందు రెండు పాత కేసుల్లో ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఓ వర్గం మత మనోభావాలను కించ పరిచేలా ఆయన ఓ వీడియో ను యూట్యూబ్‌లో అప్ లోడ్ చేయడంతో వివాదం ప్రారంభమయింది. ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేసినప్పటికీ.. నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వలేదన్న కారణంతో న్యాయమూర్తి బెయిల్ ఇచ్చారు. దీంతో పాతబస్తీలో ఉద్రిక్తత ఏర్పడింది. చివరికి పోలీసులు పీడీయాక్ట్ కింద అరెస్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాజాసింగ్‌ది పూర్తిగా వివాదాస్పదమైన చరిత్ర. రాజకీయ కారణాలతో ఆయన ఓ వర్గాన్ని తీవ్రంగా ద్వేషిస్తూ వ్యాఖ్యలు చేస్తూంటారు. ఈ క్రమంలో పలు కేసులు నమోదయ్యాయి. సాధారణంగా రిమాండ్ ఖైదీలను చంచల్ గూడ జైలుకు తరలిస్తారు. అయితే చంచల్ గూడ కూడా పాతబస్తీ పరిధిలోనే ఉండటంతో భద్రతా కారణాలతో ఆయనను చర్లపల్లి తరలించాలని నిర్ణయిం చారు.