సీఎం రేవంత్ , మంత్రుల నివాసాల వద్ద బందోబస్తు
posted on: Feb 1, 2026 5:34PM
.webp)
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ విచారణ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల నివాసాల ముట్టడికి బీఆర్‌ఎస్ శ్రేణులు పిలుపునివ్వడంతో హైదరాబాద్‌లో భద్రతను కట్టదిట్టం చేశారు. తెలంగాణ భవన్, మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నిఘా పెంచడంతో పాటు ప్రధాన మార్గల్లో ఆంక్షలు విధించి పరిస్ధితిని సమీక్షిస్తున్నారు.
బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు, ఆందోళనలు చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిన్ని ముట్టడించేందుకు వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ఏ క్షణానైనా ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించే అవకాశం ఉండటంతో సీఎం వద్ద పోలీసులు భద్రత పెంచారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లే మూడు దారుల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు



.webp)

.webp)


