ఫోన్ ట్యాపింగ్ కేసులో... కేసీఆర్ సిట్ విచారణ ప్రారంభం

posted on: Feb 1, 2026 2:27PM

 

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు  నివాసంలో సిట్ విచారణ కొనసాగుతోంది. నందినగర్‌లోని కేసీఆర్ ఇంటిలో రెండో అంతస్తులోనే సిట్ అధికారులు విజయ్ కుమార్, వెంకటగిరి, నారాయణరెడ్డి, శ్రీధర్, కేఎస్ రావు ఆయన విచారిస్తున్నారు. అడ్వకేట్ రాంచందర్‌రావుతో పాటు మరోకరు కేసీఆర్ వెంట ఉండేందుకు సిట్ అనుమతిచ్చింది.  గతంలో ఇదే కేసులో హరీష్‌రావు, కేటీఆర్, సంతోష్‌లను విచారించిన విధంగానే కేసీఆర్‌ను కూడా విచారి స్తామని అధికారులు వెల్లడిం చారు. 

రాజకీయ నాయకుల విచారణలో న్యాయవా దులకు అనుమతి ఇవ్వని గత ఉదాహరణలను సిట్ అధికారులు గుర్తు చేశారు. ఇదిలా ఉండగా, విచారణ కోసం సిట్ బృందం ఇప్పటికే కేసీఆర్ నివాసానికి చేరుకుంది. భద్రతా ఏర్పాట్ల ను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఇంటి పరిసరాల్లో పోలీసుల మోహరింపు పెంచారు. విచారణ ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విచారణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కేసీఆర్ విచారణలో ఏ అంశాలు ప్రస్తావనకు వస్తాయన్న దానిపై ఉత్కంఠ కొనసాగు తోంది. విచారణ అనంతరం సిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

google-ad-img
    Related Sigment News
    • Loading...