నేడే కేసీఆర్ సిట్ విచారణ...బీఆర్‌ఎస్ నిరసనలు
posted on: Feb 1, 2026 9:53AM

తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా మాజీ ముఖ్య మంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేడు సిట్ విచారణకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు హైదరాబాద్ నందినగర్ కేంద్రంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. విచారణకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఇప్పటికే ఖరారవగా, పోలీసులు, ఇంటెలిజెన్స్ శాఖలు హై అలర్ట్ ప్రకటించాయి.
ఉదయం 9 గంటలకు ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్ నుంచి బయల్దేరనున్న కేసీఆర్, ఉదయం 11 గంటల ప్రాంతంలో నందినగర్‌లోని తన నివాసానికి చేరుకోను న్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సిట్ అధికారులు కేసీఆర్‌ను విచారించను న్నారు. విచారణ మొత్తం నందినగర్ నివాసంలోనే జరగనున్నట్లు ఇప్పటికే అధికార వర్గాలు వెల్లడిం చాయి.సిట్ విచారణ నేపథ్యంలో నందినగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఉదయం 11 గంటల నుంచి అవసరాన్ని బట్టి నందినగర్, బసవతారకం రోటరీ, అగ్రసేన్ జంక్షన్, ఎన్‌టీఆర్ భవన్, రోడ్ నెంబర్-12 ప్రాంతాల్లో వాహనాల రాక పోకలను నిలిపివేయడం లేదా మళ్లింపు చేయను న్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రయాణికులు ముందస్తుగా ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలని సూచించారు.కేసీఆర్ సిట్ విచారణకు హాజరవుతున్న క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసు శాఖను హై అలర్ట్‌లో ఉంచారు.
ఇంటెలి జెన్స్ చీఫ్ అన్ని కమిషనర్లు, జిల్లా ఎస్పీలకు అలర్ట్ మెసేజ్ పంపినట్లు సమా చారం. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టే అవకాశం ఉందని అంచనా వేస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన ముందస్తు చర్యలు తీసు కోవాలని ఆదేశాలు జారీ చేశారు.విచారణ పూర్త య్యేంత వరకు నగరంలోని కీలక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.
పోలీసులు నందినగర్ పరిసరాల్లో భద్రతను మరింత పెంచారు.పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవే క్షిస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకోవడంతో, నేటి పరిణామాలపై రాష్ట్ర రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
కేసీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. గొర్రె తలకాయతో కూడిన సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు చేస్తూ రేవంత్ దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు.. హైదరాబాద్ మలక్‌పేట్ అక్బర్ బాగ్‌లో సీఎం రేవంత్ దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి మలక్‌పేట్ నియోజకవర్గ ఇంచార్జ్ అజిత్ రెడ్డి మరియు బీఆర్ఎస్ కార్యకర్తలు దగ్ధం చేశారు.



.webp)


