కేసీఆర్‌కి థాంక్స్ చెప్పాలి.. ఎందుకంటే...
posted on Jul 1, 2015 10:25PM

కేసీఆర్‌కి తెలంగాణ ప్రజలు, తెలంగాణ తెలుగుదేశం నాయకులు మనస్పూర్తిగా థాంక్స్ చెప్పాలి. అదేంటీ.. తన విధానాల ద్వారా ప్రజలకు టెన్షన్ పుట్టిస్తున్న కేసీఆర్‌కి తెలంగాణ ప్రజలు ఎందుకు థాంక్స్ చెప్పాలి? అలాగే తమను సాధిస్తూ, వేధిస్తున్న కేసీఆర్‌కి తెలంగాణ తెలుగుదేశం నాయకులు ఎందుకు థాంక్స్ చెప్పాలి అనే సందేహం వచ్చింది కదూ? అవును... పైన పేర్కొన్న ఇద్దరూ నిజంగానే కేసీఆర్‌కి థాంక్స్ చెప్పాలి... ఎందుకంటే, తెలంగాణ తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి రాజకీయంగా పవర్ ఫుల్‌గా మారడానికి కారణం కేసీఆర్ కారణం కావడం వల్లే... రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అనే నమ్మకాన్ని ప్రజల్లో బలంగా నాటుకునేలా చేసిన వ్యక్తి కేసీఆర్ కావడం వల్లే... కేసీఆర్ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత వున్న వ్యక్తి ఎవరా అనే అన్వేషణలో వున్న తెలంగాణ ప్రజలకు ‘రేవంత్ రెడ్డి’ అనే పేరును స్పష్టంగా తెలియజేసినందువల్లే కేసీఆర్‌కి థాంక్స్ చెప్పాలి. మొన్నటి వరకూ.... అంటే, కుట్రపూరితంగా రేవంత్ రెడ్డిని జైలుకు పంపేంత వరకూ రేవంత్‌రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ పవర్ ఫుల్ అనుకుంటే, ఈ ఓటుకు నోటు వ్యవహారం తర్వాత రేవంత్ రెడ్డి థౌజండ్ పర్సెంట్‌గా ప్రజల దృష్టిలో ఎదిగిపోయారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు రేవంత్ రెడ్డిలో తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రిని చూస్తున్నారు. ఆ ఊహను నిజం చేయాలన్న ఆసక్తి కూడా ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో ఏర్పడింది. నిజానికి తన ఇమేజ్‌ని అమాంతం పెంచేసిన కేసీఆర్‌కి రేవంత్ రెడ్డి కూడా థాంక్స్ చెప్పాలి.