తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి కేసీఆర్ నివాళి
posted on Oct 28, 2025 1:10PM

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ మంత్రి హరీష్ రావు నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. మాజీ మంత్రి హరీష్ రావు ఇంట్లో విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణరావు మంగళవారం (అక్టోబర్ 18) తెల్లవారు జామున కన్నుమూశారు.
హైదరాబాద్ కోకాపేట క్రిన్స్‌విల్లాస్‌లో సత్యనారాయణ పార్థివదేహానికి కేసీఆర్ నివాళులర్పించారు. తన సోదరి భర్త అయిన తన్నీరు సత్యనారాయణతో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. తన్నీరు సత్యనారాయణ మృతి వార్త తెలియగానే హరీష్ కు ఫోన్ చేసి పరామర్శించిన కేసీఆర్.. ఆ వెంటనే ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి హరీష్ రావు నివాసానికి చేరుకున్నారు. తన బావ పార్థివదేహానికి నివాళులర్పించి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.