కేసీఆర్ ఆరోగ్యంపై తెరాసలో ఆందోళన

 

 

 

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ ఆరోగ్యం విషయంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఏర్పడబోయే తొలి ప్రభుత్వానికి కేసీఆర్ నాయకత్వం వహించాలని తెరాస కార్యకర్తలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈమధ్యకాలంలో కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళలో ఆందోళన పెరిగింది. వాస్తవానికి కేసీఆర్ ఆరోగ్యం అంతంతమాత్రమే. ఆమధ్య నిరాహారదీక్ష చేసినప్పుడు ఆరోగ్యం మరింత దిగజారింది. ఇదిలా వుంటే గత కొన్ని రోజులుగా కేసీఆర్ తన ఆరోగ్యం గురించి చేస్తున్న వ్యాఖ్యలు ఆందోళన కలిగించే విధంగా వున్నాయని తెరాస కార్యకర్తలు చెబుతున్నారు.

 

కేసీఆర్ చాలా సందర్భాలలో తన ఆరోగ్యం బాగాలేదన్న విషయాన్ని చెబుతూ వస్తున్నారు. నిన్నగాక మొన్న  కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వారి ఆందోళనను మరింత పెంచేలా వున్నాయి. ‘‘దేవుడి దయవల్ల నేను బతికుంటే, ఆరోగ్యం సహరిస్తే తెలంగాణలో అధికారం చేపట్టి సేవ చేస్తాను’’ అని కేసీఆర్ అన్న మాటలు తెరాస కార్యకర్తలకు బాధ కలిగించాయి. కేసీఆర్ నోటి నుంచి ‘బతికుంటే’ అనే మాట రావడాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు.



శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ హుజూర్ నగర్‌లో నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి వెళ్ళాలని ఎప్పటినుంచో చెబుతున్న కేసీఆర్ ఆనారోగ్య కారణాల వల్ల ఆ కార్యక్రమానికి వెళ్ళలేదు. ఇప్పుడే పరిస్థితి ఇలా వుంటే ఎన్నికల లోపు ఊపిరి సలపకుండా చేసే ప్రచారం కారణంగా తమ నాయకుడి ఆరోగ్యం ఏమవుతోందోనని వారు భయపడుతున్నారు. కేసీఆర్‌కి ఏమీ కాకూడదని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu