Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేటీఆర్ కు కేసీఆర్ వార్నింగ్.. కంట్రోల్ యువర్ టంగ్..
posted on: Jan 11, 2016 4:54PM

ఎన్నికల ముందు అతిగా ఆవేశపడొద్దు.. కంట్రోల్ యువర్ టంగ్.. ఎవరు ఎవరికి క్లాస్ తీసుకుంటున్నారు అనుకుంటున్నారా.. తెలంగాణ సీఎం కేసీఆర్.. తన కొడుకు కేటీఆర్ కు తీసుకున్న క్లాస్ ఇది. ఎందుకంటారా.. రాజకీయ నేతలు ఆచి తూచి మాట్లాడకపోతే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో వారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. అందునా ఎక్కడ ఏ పాయింటో దొరుకుతుందా.. ప్రతిపక్ష పార్టీలను ఏకిపారేద్దామా.. అని ఎదురుచూస్తున్న రోజుల్లో ఎంత జాగ్రత్తగా మాట్లాడితే అంత మంచిది. కానీ ఇటీవల కేటీఆర్ తాను చేసిన వ్యాఖ్యలతో ప్రతిపక్షాలకు విమర్సించే ఛాన్స్ ఇచ్చారు.. దీంతో తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే క్లాస్ తీసుకునే పరిస్థితి వచ్చిందట.
గ్రేటర్ ఎన్నికల బాధ్యతను కేటీఆర్ తన భుజాల మీద వేసుకున్న సంగతి తెలసిందే. అయితే గ్రేటర్లో సీమాంధ్రులు ఎక్కువ కాబట్టి వారి ఓట్లు కూడా పడాలంటే కాస్త వారు మెచ్చే మాటలు కూడా నాలుగు మాట్లాడాల్సిందే. అందుకే కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో తన వాక్యాతుర్యాన్ని ఉపయోగించి సీమాంధ్రులను ఆకర్షించడానికి పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. అలా తెరాసను భవిష్యత్తులో ఏపీకి కూడా విస్తరిస్తామని.. అప్పుడు నేను భీమవరం నుండి పోటీ చేస్తాను.. అక్కడైతే నేను తేలికగా గెలుస్తాను.. ఎందుకంటే కోడి పందేలు లీగల్ చేస్తే నాకే ఓట్లు వేస్తారు అని వ్యాఖ్యానించారు. అయితే తాను వ్యాఖ్యానించడం వరకూ బానే ఉంది కానీ ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు గాను కేసీఆర్ కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారట. ఈ వ్యాఖ్యలపై తెలంగాణలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది..నువ్వు భీమవరం నుండి పోటీచేస్తానన్న మాటలు తెలంగాణ ప్రజలు తప్పుగా అర్ధం చేసుకుంటే ఇబ్బందని కేసీఆర్ కేటీఆర్‌కు క్లాస్ పీకారట. ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఎప్పుడూ మాట్లాడకూడదు… అలా మాట్లాడితే ఓట్ల కోసం ఏమైనా చేస్తారా అన్న ఆలోచన వారికి వెళుతుంది..కంట్రోల్ యువర్ టంగ్ అని కేసీఆర్ కేటీఆర్‌తో అన్నట్టు సమాచారం.
ఇక దీంతో కేటీఆర్ తను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చేందుకు తంటాలు పడుతున్నారు. అందుకే ప్రెస్ మీట్లు పెట్టి మరీ తాను సరదాగా వ్యాఖ్యానించానని.. టీఆర్ఎస్ ను ఏపీ విస్తరించేది లేదని చెబుతున్నారు. మొత్తానికి కేసీఆర్ కొడుకని కూడా చూడకుండా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. మరి ఇప్పుడైనా కేటీఆర్ కంట్రోల్ గా మాట్లాడుతారో లేదో చూడాలి.






