కేసీఆర్ పీడకల వెనుక రహస్యమిదే..

posted on: May 13, 2014 11:08AM

 

 

 

ఫామ్ హౌస్‌లో రెస్ట్ తీసుకుంటున్న తెరాస అధ్యక్షుడు కేసీఆర్ అప్పుడప్పుడు కొన్ని పీడకలలు కంటూ వుంటాడు. వెంటనే ప్రెస్ మీట్ పెట్టి తనకు వచ్చిన పీడకలల వివరాలు జనానికి చెబుతూ వుంటాడు. రీసెంట్‌గా ఆయన ఒక పీడకల కన్నాడు. ఆ కల ఆయనకు స్వీట్ డ్రీమ్ కావొచ్చేమోగానీ, అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ ప్రజలకు మాత్రం అదొక పీడకల. ఇంతకీ కేసీఆర్ కన్న పీడకల సారాంశం ఏమంటంటే, జనరల్ ఎలక్షన్స్ ఫలితాలు విడుదలైన తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. సీమాంధ్రలో జగన్ అధికారంలోకి వస్తాడు. వీళ్ళిద్దరూ కలసి రెండు రాష్ట్రాలనీ కలసి మెలసి అద్భుతంగా డెవలప్ చేసేస్తారు. కేసీఆర్ ఈ మాట చెప్పినప్పుడు తెలంగాణ ప్రజలు బిత్తరపోతే, సీమాంధ్ర ప్రజలు ఉలిక్కిపడ్డారు.

 

కేసీఆర్, జగన్ కలసి మెలసి వుండే సంగతి ఏమోగానీ, ఈ రెండు రాష్ట్రాల్లో వీరిద్దరూ అధికారంలోకి రాకూడదని రెండు ప్రాంతాల ప్రజలు కలసిమెలసి ముక్కోటి దేవతలని కోరుకున్నారు. సోమవారం నాడు వెలువడిన మునిసిపల్ ఫలితాలు ఇటు తెలంగాణకి కేసీఆర్ గండం, అటు సీమాంధ్రకి జగన్ గండం లేదని చెప్పకనే చెప్పాయి. ఇదిలా వుంటే, మహానుభావుడు కేసీఆర్ సీమాంధ్రలో జగన్ రావాలని ఎందుకు కోరుకుంటున్నాడన్న అంశం మీద రాజకీయ వర్గాలలో భారీ స్థాయిలో చర్చ జరిగింది. సీమాంధ్రలో తెలుగుదేశం అధికారంలోకి వస్తే హైదరాబాద్‌లో, తెలంగాణలో సీమాంధ్రులు స్థాపించిన పరిశ్రమలన్నీ సీమాంధ్రకు తరలిపోయే అవకాశం వుంది.


సీమాంధ్రులు స్థాపించిన పరిశ్రమలు మాత్రమే కాదు.. తెలంగాణవాళ్ళు స్థాపించిన పరిశ్రమలు కూడా సీమాంధ్రకు వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తాయి. అలా జరిగితే, తెలంగాణ పారిశ్రామికంగా మైనస్‌లో పడిపోతుంది. ఆ మైనస్‌ని సరిదిద్దే శక్తి కేసీఆర్‌కి లేదు. పాపం ఈ పెద్దమనిషికి సీమాంధ్రులను తిట్టడం తప్ప మరో పని వస్తేగా? అదేగనుక సీమాంధ్రలో జగన్ ప్రభుత్వం వస్తే హైదరాబాద్‌లోని ఒక్క పరిశ్రమ కూడా సీమాంధ్ర ముఖం చూడదు. జగన్‌కి భయపడి పారిశ్రామికవేత్తలు సీమాంధ్ర ముఖం కూడా చూడరు. అప్పుడు తెలంగాణలో పరిశ్రమలు అక్కడే పడుంటాయి. కేసీఆర్‌కి ఎలాంటి ఇబ్బందీ వుండదు. ఈ ముందు చూపుతోనే కేసీఆర్ సీమాంధ్రలో జగన్ రావాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు మునిసిపల్ ఫలితాల తర్వాత తెలంగాణలో కేసీఆర్, సీమాంధ్రలో జగన్ అధికారంలోకి రారని తేలిపోయింది కాబట్టి రెండు ప్రాంతాలకీ నో ప్రాబ్లం.

google-ad-img
    Related Sigment News
    • Loading...