మాట మీద నిలబడ్డ కేసీఆర్.. కొన్ని ఏళ్ల సమస్యకు పరిష్కారం...

 

ప్రతి ఇంటికి నీళ్ళు అందిస్తేనే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతాను లేకపోతే ఓట్లు అడగను.. ఇంత ధైర్యంగా ఈ శపధం చేసింది ఎవరబ్బా అనుకుంటున్నారా...?ఎవరో కాదు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. నల్గొంగ జిల్లా విషయంలో కేసీఆర్ ఇంత పెద్ద శపధం చేశారు. అసలు కేసీఆర్ శపధం చేయడానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే.  నల్గొండ జిల్లా  ప్లోరిసిస్ ప్రాంతానికి మారు పేరు. దరిద్రం ఏంటంటే.. నాగార్జునసాగర్ పక్కనే ఉన్నాకాని త్రాగడానికి గుక్కెడు నీళ్ళు కూడా లేని ప్రాంతం. దీనికి కారణం ఆ నీళ్లలో ప్లోరిసిస్ ఉండటమే. ఇది ఇప్పటి సమస్య కాదు. కొన్ని సంవత్సరాల నుండి నల్గొండ వాసులను ఇబ్బంది పెడుతున్న సమస్య.  జిల్లాలో మొత్తం మూడు వేల నాలుగు వందల డెబ్బై ఏడు గ్రామాల్లో నలబై శాతం గ్రామంలో 1పీపీఎం ను మించి ప్లోరిసిస్ మోతాదు ఎక్కువగా ఉంది .ముఖ్యంగా మునుగోడు నియోజక వర్గంలో మర్రిగూడెం ,నాంపల్లి మండలాల్లో అత్యధికంగా ఇరవై శాతం వరకు ఉండటం గమనార్హం.


దీంతో కేసీఆర్.. ఈ సమస్యకు పరిష్కారం చూపే దిశగా అడుగులు వేశారు. దీనిలోభాగంగానే ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. దీనిద్వారా ఇప్పటికే జిల్లాలో బట్లపల్లి గ్రామంలో మొత్తం నాలుగు వందల కోట్ల రూపాయలతో ట్రీట్ మెంట్ ప్లాంట్ పనులను ఇప్పటికే తొంబై శాతం పూర్తిచేశారు. ఆరు మండలాల్లో వచ్చే డిసెంబర్ లోపు పనులు పూర్తీ కానున్నాయి. జిల్లాలో ఎక్కువగా పీడత ప్రాంతంగా ఉన్న మునుగోడు అసెంబ్లీ నియోజక వర్గంలో అధిక నిధులను కేటాయించి పనులను శరవేగంగా పూర్తిచేస్తున్నారు .అంతే కాకుండా మరో 113.67 కోట్ల రూపాయలతో అంతర్గత పనులను పూర్తిచేస్తున్నారు .మరో కొద్ది నెలలో మిషన్ భగీరథ పనులను పూర్తిచేసి నల్గొండ జిల్లాను కొన్ని దశాబ్దాలుగా పీడిస్తున్న ప్లోరిసిస్ సమస్యను పరిష్కరించి దేశానికే ఆదర్శంగా నిలవనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ .. మొత్తానికి కేసీఆర్ మాట మీద నిలబడి నల్గొండ జిల్లాకు ఓ పరిష్కారం చూపిస్తున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ధైర్యంగా ఓట్లు అడగొచ్చన్నమాట.