Latest News

అవును! నేను ఇంకా పని మొదలుపెట్టలేదు: కేసీఆర్

posted on: Sep 16, 2014 9:09PM

 

 

అవును! నేను ఇంకా పని మొదలుపెట్టలేదు. ఈ మాటన్నది ఎవరో కాదు సాక్షాత్ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీలయిన తెదేపా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కేసీఆర్ ఎంతసేపు గొప్పలు చెప్పుకోవడమే తప్ప అధికారం చేప్పట్టి మూడు నెలలయినా ఇంత వరకు పని మొదలు పెట్టలేదని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో వేరొకరయితే తమ ప్రభుత్వం చేప్పట్టిన కార్యక్రామలను ఏకరువు పెడుతుంటారు. కానీ కేసీఆర్ మాత్రం చాలా దైర్యంగా “అవును! మా ప్రభుత్వం ఇంకా పని మొదలుపెట్టలేదు” అని చెప్పడం విశేషమే. అంతే కాదు “ఒకసారి తన ప్రభుత్వం పని చేయడం మొదలు పెడితే ఇక ఏ ప్రతిపక్ష పార్టీ తమ ప్రభుత్వం ముందు నిలవలేదని” హెచ్చరించారు కూడా.

 

తన ప్రభుత్వం ప్రణాళికా బద్దంగా ముందుకు సాగాలనే ఆలోచనతో అందుకు తగిన ఏర్పాట్లు చేసుకొని అడుగు ముందుకు వేస్తుందని ఆయన చెప్పారు. వ్యవసాయ రుణాలతో సహా తాను ఇచ్చిన ప్రతీ హామీని ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తుందని, అయితే అంతవరకు ప్రతిపక్ష పార్టీలు నోటికి వచ్చినట్లు వాగుతుంటూనే ఉంటాయని, వాటిని తాను పట్టించుకొబోనని అన్నారు. తెలంగాణ అవసరాలకు సరిపోయే విధంగా బడ్జెట్ తిరిగి రూపొందిస్తునందున బడ్జెట్ సమావేశాలలో కొంచెం జాప్యం జరుగుతోందని, అయితే డిశంబరులోగా రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకొనే వెసులుబాటు ఉన్నందున, అన్ని విధాల తెలంగాణకు సరిపోయే బడ్జెట్ ను తయారుచేసి దానిని ముందుగా ఆర్ధిక సంఘానికి సమర్పించిన తరువాతనే బడ్జెట్ సమావేశాలు మొదలు పెడతామని ఆయన స్పష్టం చేసారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...