తండ్రిని వెనకేసుకు వచ్చిన కేటీఆర్

posted on: Aug 11, 2014 11:44AM

 

కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేప్పట్టిన కేసీఆర్, 125 కోట్ల మంది జనాభా ఉన్న అతిపెద్ద దేశాన్ని నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘ఫాసిస్టు’ అని చులకనగా మాట్లాడటం పట్ల సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానమంత్రి వంటి గౌరవప్రదమయిన స్థానంలో ఉన్న ఒక వ్యక్తి గురించి బాధ్యతాయుతమయిన పదవిలో ఉన్న ఒక ముఖ్యమంత్రి ఈవిధంగా మాట్లాడి ఉండకూడదని ప్రజలు భావిస్తున్నారు. కేసీఆర్ ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకొంటే బాగుటుందని కేంద్రపట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు.

 

అయితే కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా చేస్తున్న ఆయన కుమారుడు కే. తారక రామారావు, తన తండ్రిని వెనకేసుకు వస్తూ “ఆయన చేసిన వ్యాఖ్యలలో తప్పేముంది? హక్కుల కోసం పోరాడితే అది ప్రజాస్వామ్యం అవుతుందని, అదే హక్కులను కబళించే ప్రయత్నం ఫాసిజం అవుతుందని’ వాదిస్తున్నారు. సైద్దాంతికంగా ఆయన వాదన సరయినదే కావచ్చును. కానీ ఒక ముఖ్యమంత్రి దేశ ప్రధానిని పట్టుకొని ఫాసిస్టు అని చులకనగా మాట్లాడటం సబబేనా? అనేదే ప్రశ్న. ఒక తప్పును సమర్ధించుకొంటూ ఇంకా విమర్శలు ఎదుర్కోవడం కంటే, తప్పును సరిదిద్దుకొంటే ఎంతో హుందాగా ఉంటుంది. కేంద్రంతో తెలంగాణా ప్రభుత్వం సఖ్యతగా మెలగకపోయినా ఏమీ నష్టం ఉండదు. కానీ కేంద్రంతో కూడా కయ్యానికి కాలు దువ్వడం వలన మాత్రం తెలంగాణా ప్రజలకి ఎంతో కొంత నష్టం కలిగే అవకాశం ఉంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...