సీఎం కేసీఆర్: ఆస్తి మూరెడు.. ఆశ బారెడు!

posted on: Jun 4, 2014 12:42PM

 

తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవహారం ఆస్తి మూరెడు ఆశ బారెడు అన్నట్టుగా వుంది. ఇక్కడ డిస్కస్ చేస్తున్నది ఆయన వ్యక్తిగత ఆస్తి గురించి కాదు.. తెలంగాణ ప్రభుత్వ ఆస్తి గురించి.. హైదరాబాద్‌ విషయంలో కేసీఆర్ ఆశ గురించి. ఇంతకాలం వాళ్ళనీ వీళ్ళని తిడుతూ ఉద్యమాన్ని లాగించేసిన కేసీఆర్ ఇప్పుడు తాను ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టినంత ఈజీగా పరిపాలన సాగించేయొచ్చని భావిస్తున్నట్టుగా వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేసీఆర్ జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో హైదరాబాద్‌ అభివ‌ద్ధి గురించి కేసీఆర్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ హైదరాబాద్ డెవలప్‌మెంట్ గురించి వ్యక్తం చేసిన కోరికలు కళ్ళు తిరిగేలా వున్నాయి. హైదరాబాద్‌ని అర్జెంటుగా స్వర్గంలాగా మార్చేయాలన్నట్టుగా కేసీఆర్ కోర్కెలను వ్యక్తం చేశారు. అధికారుల ముందు పెద్ద కోర్కెల చిట్టా విప్పి, వీటన్నిటినీ అర్జెంటుగా చేసేయండని ఆదేశాలు ఇచ్చేశారు. ఆయన ఆదేశాలు ఇచ్చినంత ఈజీగా పనులు జరగవని కొంతమంది అధికారులు సమావేశం తర్వాత గుసగుసలాడుకున్నట్టు సమాచారం. తాను ముఖ్యమంత్రి కాగానే హైదరాబాద్‌ని అద్భుతంగా మార్చేయాలన్న ఉత్సాహం కేసీఆర్‌లో కనిపించిందే తప్ప, ఆయన చెప్పిన కోర్కెల చిట్టా నెరవేరాలంటే డబ్బులు ఎలా వస్తాయన్న విషయం మాత్రం కేసీఆర్ చెప్పలేదని అధికారులు అనుకుంటున్నారు. తెలంగాణ వచ్చినంతమాత్రాన, కేసీఆర్ ముఖ్యమంత్రిగా వున్నంత మాత్రాన హైదరాబాద్‌ అద్భుతంగా డెవలప్ అయిపోతుందన్న భ్రమలు జనంలో క్రియేట్ చేయటం అంత మంచిది కాదన్న అభిప్రాయంలో కొందరు అధికారులు వున్నట్టు సమాచారం. క్రమక్రమంగా అభివృద్ధి జరగాలే తప్ప, కేసీఆర్ అనుకుంటున్నట్టు మెరుపు వేగంతో అభివ‌ృద్ధి జరిగిపోవడం అసంభవమని వారు భావిస్తున్నట్టు సమాచారం.

google-ad-img
    Related Sigment News
    • Loading...