వైభవ్ సూర్యవంశీకి కావ్యామారన్ అభినందనలు

posted on: May 28, 2026 3:24PM

ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఘోర పరాజయానికి రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్, వండర్ కిడ్, బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగే ప్రధాన కారణమనడంలో సందేహం లేదు.   ఈ ఓటమితో సన్‌రైజర్స్ హైదరాబాద్ టోర్నమెంట్ నుండి నిష్క్రమించాల్సి వచ్చింది. తన జట్టు ఓడిపోవడంతో స్టాండ్స్‌లో కూర్చున్న సన్‌రైజర్స్ కో-ఓనర్ కావ్య మారన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మైదానంలోనే ఆమె కన్నీటి పర్యంతమైన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యారు. అయితే ఆ తరువాత కావ్యామారన్ ప్రదర్శించిన క్రీడా స్ఫూర్తికి క్రీడాభిమానులు ఫిదా అయ్యారు. 

సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో కావ్య మారన్ ఎప్పుడూ మైదానంలోకి అడుగుపెట్టరు. ఆమె కేవలం స్టాండ్స్ నుండే మ్యాచ్ వీక్షిస్తూ తన జట్టును ఉత్సాహపరుస్తారు. కానీ.. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే ఆమె తనేరుగా మైదానంలోకి నడిచారు. ఓటమి బాధను పక్కన పెట్టి తన జట్టు ఆటగాళ్లను ఓదార్చడమే కాకుండా.. ప్రత్యర్థి జట్టులోని 15 ఏళ్ల యువ స్టార్ వైభవ్ సూర్యవంశీ వద్దకు స్వయంగా వెళ్లి కరచాలనం చేసి  అతని అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనను  అభినందించారు. ఆల్ ది బెస్ట్ చెప్పారు. కావ్య మారన్ చూపించిన ఈ క్రీడా స్ఫూర్తిని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.  సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ అభినందన వీడియో,  ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.  

google-ad-img
    Related Sigment News
    • Loading...