కావూరికి నచ్చజెబుతున్న అహ్మద్ పటేల్
posted on: Oct 27, 2012 3:40PM
.jpeg)
ఈసారి తప్పకుండా పదవి వస్తుందని కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న కావూరి కాంగ్రెస్ అధిష్టానం తీరుపట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తునట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను లోకసభ స్పీకర్, సోనియాగాంధీకి పంపించారు. పరిస్థితిని గమనించిన సోనియా సలహాదారు అహ్మద్ పటేల్ రంగంలోకి దిగి కావూరికి నచ్చజెప్పడానికి యత్నిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే కొంత మంది సీనియర్ మంత్రులు తమ పదవులు త్యజించి పార్టీ బాధ్యతలు స్వీకరించనున్న విషయాన్ని అహ్మద్ పటేల్ ఈ సందర్భంగా కావూరికి వివ రించినట్టు తెలుస్తున్నది. మళ్లీ యు.పి.ఎ. అధికారంలోకి రావాలంటే మీవంటి సీనియర్లు పార్టీ బాధ్యతలు స్వీకరించాలని, సీనియర్లను, పార్టీకి సేవ చేసిన వారినీ కాంగ్రెస్ విస్మరించడం అనేది జరగదనీ ఆయన కావూరికి వివరించినట్టు తెలుస్తున్నది.విజయవాడ ఎం.పి. లగడపాటి కూడా కావూరితో మాట్లాడి మీది న్యాయమైన కోరికే, కాని తొందరపడవద్దని చెప్పినట్టు తెలుస్తున్నది.






