కావూరి కుంటిసాకులు!
posted on Apr 3, 2014 12:32PM
.jpg)
కాంగ్రెస్ పార్టీలో వుంటే వచ్చే ఎన్నికలలో ఎంపీగా గెలిచే అవకాశం లేదని అర్థం చేసుకున్న కావూరి సాంబశివరావు కేంద్రమంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరే ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీలో చేరినప్పటికీ కావూరికి ఎవరు ఓటు వేస్తారో దేవుడికే తెలియాలి. కావూరి రాజీనామా వెనుక వున్నది పదవీ కాంక్షేనని క్లియర్‌గా తెలుస్తున్నప్పటికీ కావూరి తన రాజీనామా వెనుక అసలు కారణాలంటూ ఏవేవో కుంటి సాకులు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయకపోవడంతో ఆయన చాలా హర్టయిపోయి రాజీనామా చేశాడట, అంతేతప్ప పదవీ కాంక్షతో కాదట. పోలవరం ఆర్డినెన్స్ జారీ చేయాలని తాను అనేకసార్లు ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసినా ఆయన పట్టించుకోకపోవడంతో రాజీనామా చేశానని కావూరి కుంటిసాకులు చెబుతున్నారు. నాయనా కావూరీ, నీ మాటలు నమ్మడానికి సీమాంధ్రుల చెవుల్లో పూలు లేవు.