యువ కవుల కోసం కవితా కార్యశాల

యువకవులకు కవితా నిర్మాణాలపై శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ పిలుపునిచ్చారు.హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్,విమలా సాహితీ సమితి ఆధ్వర్యంలో నగరంలోని యువకవులకు "ఆధునిక వచనకవితా నిర్మాణ పద్ధతులపై శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ జెల్ది విద్యాధర్ రాసిన కోహినూర్,ముసాఫిర్ తెలుగు కవితా సంపుటాల ఆంగ్లానువాద గ్రంథాలను కొలకలూరి ఇనాక్ ఆవిష్కరించారు. విద్యాధర్ గొప్ప ప్రేమతత్వంతో ,మానవీయ కోణంలో రాసిన కవితా సంపుటాలను ఎంతో సృజనాత్మక ప్రతిభతో అనువాదకులు కొండపాక  రవీంద్రాచారి ఆంగ్లంలో అనువదించడం అభినందనీయమన్నారు.ప్రముఖ కవి, కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ  కవిత్వ కార్యశాలలో  ప్రపంచ కవితా నిర్మాణాలపై బిక్కి కృష్ణ,ఆధునిక కవిత్వం వస్తువైవిధ్యం పై డాక్టర్ నాళేశ్వరం శంకరం,వచన కవిత్వం అభివ్యక్తి నవ్యతపై శైలజామిత్రలు శిక్షణనిచ్చారు.

డాక్టర్ పి.విజయలక్ష్మి పండిట్ కవిత్వంపై కీలకోపన్యాసం చేశారు.బిక్కి కృష్ణ రాసిన కవిత్వం - డిక్షన్  పుస్తకాన్ని డాక్టర్ రాధా కుసుమ పరిచయం చేశారు. పద్మశ్రీలత వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కవిత్వ కార్యశాలలో అనేకమంది కవులు  తమ కవితలు వినిపించారు.వాటిని శిక్షకులు విశ్లేషించి కవులను అభినందించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu