కర్నూలు బస్సు ప్రమాద సంఘటన- కావేరీ ట్రావెల్స్ యజమాని అరెస్ట్, విడుదల
posted on Nov 7, 2025 5:15PM
.webp)
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద సంఘటనలో కావేరి ట్రావెల్స్ బస్సు యజమాని వేమూరి వినోద్ కుమార్ ను జు పోలీసులు శుక్రవారం (నవంబర్ 7) అరెస్ట్ చేశారు. గత నెల 24న కర్నూలు సమీపంలో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే.
దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటనకు సంబంధించి బస్సు ప్రమాదానికి కారణమైన మొదటి ముద్దాయి మిర్యాల లక్ష్మయ్య ను గత నెల 28న పోలీసులు అరెస్ట్ చేశారు. రెండవ నిందితునిగా ఉన్న బస్సు యజమాని వేమూరి వినోద్ కుమార్ ను శుక్రవారం (నవంబర్ 7) అరెస్ట్ చేశారు. అనంతరం జే ఎఫ్ సి ఎం మొబైల్ కోర్టులో హాజరు పరిచారు. బస్సు యజమాని వేమూరి వినోద్ కుమార్ కు పదివేల రూపాయలు సొంత పూచికత్తుతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది.