Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కశ్మీర్‌లో మళ్లీ కాల్పులు!
posted on: Jul 30, 2016 2:28PM

కశ్మీర్ ఇవాళ ఉదయం, కాల్పులతో నిద్ర లేచింది. కుప్వారా జిల్లా వద్ద ఉన్న సరిహద్దుగుండా దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు తీవ్రవాదులను రక్షణదళాలు హతమార్చాయి. కానీ ఈ పోరాటంలో భాగంగా ఇద్దరు సైనికులు కూడా మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే చల్లారుతున్న ఉద్రక్తతలను రెచ్చగొట్టేందుకే ఈ తీవ్రవాదులు, దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించారన్నది నిఘా వర్గాల అనుమానం. ఈ నెల 8వ తేదీని సైనికులు ‘బుర్హాన్ వనీ’ అనే తీవ్రవాదిని కాల్చిచంపడంతో కశ్మీర్ అట్టుడికిపోయింది. ఈ సందర్భంగా జరిగిన అల్లర్లలో దాదాపు 50 మంది చనిపోగా, 1500 మంది గాయాల పాలయ్యారు. కాగా ‘వనీ’ చావుని అడ్డం పెట్టుకొని పాకిస్తాన్, స్థానికంగా ఉన్న అల్లరి మూకలను రెచ్చగొట్టిందన్నది ఒక ఆరోపణ. ఒకవైపు బయటనుంచి అల్లరల్లను రెచ్చగొడుతూనే, మరోవైపు చొరబాట్లను కూడా ప్రేరేపిందనడానికి బలమైన సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగా ఈ మంగళవారం దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన నలుగురు తీవ్రవాదులను, సైన్యం మట్టుపెట్టగలిగింది. కాగా బహదూర్ అలీ అనే మరో తీవ్రవాదని సజీవంగా పట్టుకోగలిగింది. బహదూర్ అలీ, కశ్మీర్‌లో ఆత్మాహుతి దాడికి పాల్పడటం ద్వారా, రాష్ట్రంలో రావణకాష్టాన్ని మరింతగా రగిల్చేందుకే వచ్చాడని విచారణలో తేలింది. ఇలాంటి పరిస్థితుల మధ్య కశ్మీర్‌లోని చాలా ప్రాంతాలు ఇంకా కర్ఫ్యూలోనే మగ్గుతున్నాయి.






